Facebook Donation: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ సీఈవో మరోసారి దాతృత్వం ప్రదర్శించారు. వివిధ వ్యాధుల పరిశోధనకై భారీగా విరాళం ప్రకటించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ దంపతులు చేసిన విరాళాల ప్రకటన అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఓ విధంగా చెప్పాలంటే విరాళాల వర్షం కురిపించారు. మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిసిల్లా ఛాన్లు వివిధ రకాల వ్యాధులకు సంబంధించి పరిశోధనల కోసం భారీగా విరాళాలు ఇచ్చారు. తమ స్వచ్ఛంధసంస్థ చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ నుంచి ఏకంగా 2 లక్షల 50 వేల కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తొలిదశలో 25 వేలకోట్ల విరాళాలిస్తామని జుకర్‌బర్గ్ (Mark Zuckerberg)దంపతులు తెలిపారు.
వైద్యరంగంలో కొత్త పరిశోధనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై(Artificial Intelligence)పనిచేసేందుకు హార్వర్డ్ యూనివర్శిటీలో విద్యాసంస్థ నెలకొల్పతున్నారు. ఈ విద్యాసంస్థ కోసం 3 వేల 770 కోట్లు అందించనున్నారు. మరో 15 ఏళ్లపాటు ఇదే సంస్థకు నిధులు కూడా అందించనున్నారు. మరోవైపు సీజెడ్ఐ(CZI) సంస్థ తరపున నడుస్తున్న బయో మెడికల్ ఇమేజింగ్ ఇనిస్టిట్యూట్‌కు 4 వేల నుంచి 7 వేల కోట్ల వరకూ అందించనున్నారు. సీజెడ్ బయోహబ్ నెట్వర్క్ కోసం మరో వంద కోట్లు కేటాయించారు.
Also read: Faisalabad Incident Video: పాకిస్తాన్ లో వివస్త్రలను చేసి నలుగురు మహిళలపై దాడి.. వార్తల్లో నిజమెంత?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook