IND vs NZ 1st Test: కాన్పూర్ వేదికగా టీమ్ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ముగిసింది. నాలుగో రోజు ఆట పూర్తయ్యే సమయానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు వికెట్ నష్టపోయి 4 పరుగులు సాధించింది. క్రీజులో టామ్ లాథమ్(2*), విలియమ్ సోమర్విల్లే(0) ఉన్నారు. కివీస్ టీమ్ గెలవాలంటే మరో 280 పరుగులు చేయాల్సిఉంది. విల్ యంగ్ (2)ను స్పిన్నర్ అశ్విన్ పెవీలియన్ పంపాడు.
మూడో రోజు 14 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా టాప్ ఆర్డర్ విఫలమైన మిడిల్ ఆర్డర్ ఆదుకుంది. శ్రేయస్ అయ్యర్ (65), వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (61) అద్భుతమైన బ్యాటింగ్ తో ఇండియా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ఈ నేపథ్యంలో 7 వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా 234 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ ప్రకటించింది. ఆ తర్వాత 284 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్ వచ్చిన న్యూజిలాండ్ జట్టు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఫలితంగా నాలుగో రోజు ఆట పూర్తయ్యే సమయానికి వికెట్ నష్టపోయి 4 పరుగులు చేసింది న్యూజిలాండ్ టీమ్. ఇక ఆఖరి రోజు తొమ్మిది వికెట్లను పడగొట్టితే విజయం భారత్ వశమవుతుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేయగా..రెండో ఇన్నింగ్స్‌లో 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 296/10. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తం టీమ్‌ఇండియా లీడ్ 283 పరుగులకు చేరింది. దీంతో 284 పరుగులు సాధిస్తే న్యూజిలాండ్ విజయం సాధిస్తుంది.
Also Read: ఒమిక్రాన్ కొత్త వేరియంట్, దక్షిణాఫ్రికా పర్యటనపై నీలినీడలు
Also Read: ICC ODI World Cup Qualifiers: ఒమిక్రాన్ ధాటికి వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook