Acharya OTT Rights: ‘ఆచార్య’ సినిమా కోసం పోటీపడుతున్న ప్రముఖ ఓటీటీ సంస్థ

Acharya OTT Rights: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆచార్య’. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మేకర్స్ తో సంప్రదించిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 03:02 PM IST
    • ‘ఆచార్య’ సినిమా కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ పోటీ
    • ఓటీటీ హక్కుల రేసులో అమెజాన్ ప్రైమ్
    • ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కానున్న చిత్రం
Acharya OTT Rights: ‘ఆచార్య’ సినిమా కోసం పోటీపడుతున్న ప్రముఖ ఓటీటీ సంస్థ

Acharya OTT Rights: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా.. ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆశ్చర్యంలో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ‘లాహే.. లాహే..’, ‘నీలాంబరి’ పాటలు ప్రేక్షకులను విపార్టీతంగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది విడుదలకానున్న ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతుందని తెలుస్తుంది. చిరంజీవి- చరణ్ కలిసి నటిస్తుండటం వల్ల ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమా అన్ని ఏరియాల్లో భారీ వసూళ్లను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

అయితే మరోవైపు ‘ఆచార్య’ సినిమా ఓటీటీ రైట్స్ కోసం పలు అంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ చిత్ర స్ట్రీమింగ్ ను దక్కించుకుందని తెలుస్తుంది. ఇందుకోసం అమెజాన్ భారీ మొత్తంలో ‘ఆచార్య’ నిర్మాతలకు ముట్టజెప్పారని తెలుస్తుంది. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకాలపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

అలాగే ఈ సినిమాలో చరణ్ సిద్ద అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు ఈ సినిమాలో చరణ్ నక్సలైట్ గా కనిపించనున్నాడు. ఇక చరణ్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. నవంబర్ 28న విడుదల ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Trivikram : డైరెక్టర్ త్రివిక్రమ్ ట్వీట్ గురించి మంత్రి పేర్ని నానికి రిప్లై

Also Read: Ramya Krishnan: మరోసారి బిగ్​ బాస్ హోస్ట్​గా రమ్యకృష్ణ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News