China Taiwan: తైవాన్‌ కచ్చితంగా చైనాలో కలవాల్సిందే ‌‌- చైనా స్టేట్ కౌన్సిలర్ వాంగ్ యీ

Chinese State Councilor and Foreign Minister Wang Yi: తాజాగా చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ సంచలన కామెంట్స్ చేశారు. చైనాలో భాగం కావడం మినహా తైవాన్‌కు వేరే భవిష్యత్తు లేదన్నారు. ఇప్పటికే ఈ దేశానికి అంతర్జాతీయంగా చట్టపరమైన గుర్తింపు లేదని పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 04:59 PM IST
  • తారస్థాయికి చేరుకుంటున్న చైనా, తైవాన్‌ ఉద్రిక్తతలు
  • చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ సంచలన కామెంట్స్
  • చైనాలో భాగం కావడం మినహా తైవాన్‌కు వేరే భవిష్యత్తు లేదన్న వాంగ్ యీ
China Taiwan: తైవాన్‌ కచ్చితంగా చైనాలో కలవాల్సిందే ‌‌- చైనా స్టేట్ కౌన్సిలర్ వాంగ్ యీ

Taiwan has no future other than reunification with mainland, no intl status other than being part of China: Chinese State Councilor and Foreign Minister Wang Yi: చైనా, తైవాన్‌ మధ్య ఉద్రిక్తతలు రోజురోజు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇక తాజాగా చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ (Chinese State Councilor and Foreign Minister Wang Yi)సంచలన కామెంట్స్ చేశారు. 
చైనాలో (China) భాగం కావడం మినహా తైవాన్‌కు (Taiwan) వేరే భవిష్యత్తు లేదన్నారు. ఇప్పటికే ఈ దేశానికి అంతర్జాతీయంగా చట్టపరమైన గుర్తింపు లేదని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో తైవాన్‌కు భాగస్వామ్యం విషయమై అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ (Anthony Blinken) ఇటీవల మద్దతు తెలిపిన నేపథ్యంలో దాన్ని ఖండిస్తూ వాంగ్‌ యీ (Wang Yi) ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 

జీ-20 సమావేశాల్లో (g20 summit) పాల్గొనేందుకు చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ రోమ్‌కు చేరుకున్నారు. అమెరికాతో (America) ఇతర కొన్ని దేశాలు 50 ఏళ్ల క్రితమే వన్ చైనా సూత్రాన్ని ఆపలేకపోయాయని ఆయన వెల్లడించారు. 21వ శతాబ్దంలోనూ అవి విజయవంతమయ్యే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. ఇక ఈ విషయంలో ఎవరైనా ఇంకా పట్టుదలతో ఉంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.

Also Read : Balakrishna pays Final Respects to Puneeth: పునీత్‌ను కడసారి చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ

ఇక చైనా తైవాన్‌ను తమ భూమిగా పేర్కొంటూ.. దాన్ని స్వాధీనం చేసుకునేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తైవాన్‌ (Taiwan) గగనతలంలోకి ఏకంగా 52 యుద్ధ విమానాలను పంపించి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అంతేకాదు చైనా, తైవాన్‌ రెండింటిని ఏకం చేసి తీరతామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) వ్యాఖ్యానించారు. 

మరోవైపు తైవాన్‌ కూడా చైనా ఒత్తిళ్లకు తలొగ్గమని తేల్చి చెబుతూ వస్తోంది. చైనా దాడికి దిగితే తైవాన్‌కు తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మద్దతు పలికారు. అయితే.. సదరు దేశాలు చైనాతో (China) దౌత్య సంబంధాలు ఏర్పరచుకునే క్రమంలో ఇచ్చిన రాజకీయ కమిట్‌మెంట్‌ను ఉల్లంఘించడంతోపాటు ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని విస్మరిస్తున్నట్లు వాంగ్‌ యీ ఆరోపించారు.

Also Read : India Bypolls: దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్ని స్థానాల్లో ఇవాళ ఉపఎన్నిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News