e Shram Portal Record: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ఈ శ్రమ్ పోర్టల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే రికార్డు స్థాయిలో కార్మికులు నమోదయ్యారు. ఈ శ్రమ్ పోర్టల్ అభివృద్ధి గురించి కేంద్ర కార్మిక ఉపాధి శాఖ వివరించింది.
అసంఘటిత రంగంలో కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం(Central government)కొత్తగా ఈ శ్రమ్ పోర్టల్(e Shram Portal) ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అసంఘటిత రంగాల్లోని కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగా పోర్టల్ ప్రారంభించిన 2 నెలలకే అద్బుతమైన స్పందన లభించింది. రెండు నెలల వ్యవధిలో ఏకంగా 4 కోట్లమంది అసంఘటిత రంగ కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో నిర్మాణం, దుస్తుల తయారీ, మత్స్య, వ్యవసాయ, రవాణా వంటి రంగాల్లో ఉపాధి పొందుతున్నవారున్నారు. అత్యధికంగా నిర్మాణం, వ్యవసాయ రంగాలకు చెందినవారు పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.
ఈ శ్రమ్ పోర్టల్ ఆధారంగానే అసంఘటిత రంగ కార్మికులకు(Unorganised Sector Workers) అన్నిరకాల సామాజిక భద్రత, ఉపాధి ఆధారిత పథకాల ప్రయోజనాలు అందనున్నాయి. మొత్తం 4.09 కోట్లమంది అసంఘటిత రంగ కార్మికుల్లో 50.02 శాతం మహిళలు కాగా, 49.98 శాతం మంది పురుషులున్నారని తేలింది. కార్మికుల సంఖ్య ఇంకా పెరుగుతోందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ వెల్లడించింది. ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఉన్నారని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ తెలిపింది. ఈ పోర్టల్‌లో పేరు నమోదు కోసం ఈ శ్రమ్ (e Shram Portal)మొబైల్ అప్లికేషన్ గానీ వెబ్సైట్ గానీ సందర్శించవచ్చు. అంతకాకుండా కామన్ సర్వీస్ సెంటర్లు, రాష్ట్ర సేవాకేంద్ర, లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్లు, గుర్తించిన పోస్టాఫీసులు, డిజిటల్ సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్నవారికి దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యే ఈ శ్రమ్ కార్డు అందిస్తారు. సంబంధిత కార్మికులు కార్డు ద్వారా ఎప్పటికప్పుడు తమ వివరాల్ని పోర్టల్‌లో అప్డేట్ చేసుకోవచ్చు. ఈ శ్రమ్ కార్డు(e Shram Card) కలిగినవారికి ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత అంగవైకల్యం కలిగితే 2 లక్షల రూపాయల పరిహారం అందనుంది. పాక్షిక అంగవైకల్యానికి లక్ష రూపాయలు సహాయం అందుతుంది.
Also read: Onion Prices Hike: ఆకాశాన్నంటుతున్న ఉల్లిధరలు, ఇప్పట్లే తగ్గే పరిస్థితి లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి