Pakistan vs Talibans: తాలిబన్లు, పాకిస్తాన్ మధ్య విమాన సర్వీసుల వివాదం, నిలిచిన సర్వీసులు

Pakistan vs Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు మారుతున్నాయి. తాలిబన్లకు, పాకిస్తాన్‌కు మధ్య విభేదాలు పొసగుతున్నాయి. తాలిబన్ల వార్నింగ్‌కు ప్రతిగా పాకిస్తాన్ చర్యలకు దిగింది. రెండు దేశాల మధ్య విమాన సర్వీసుల తగాగా పెరిగి పెద్దదవుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 15, 2021, 10:44 AM IST
  • పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య విమాన సర్వీసుల వివాదం
  • ధరలు తగ్గించకపోతే విమాన సర్వీసులు నిలిపివేస్తామని హెచ్చరించిన తాలిబన్లు
  • కౌంటర్‌గా ఆఫ్ఘనిస్తాన్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన పాకిస్తాన్
 Pakistan vs Talibans: తాలిబన్లు, పాకిస్తాన్ మధ్య విమాన సర్వీసుల వివాదం, నిలిచిన సర్వీసులు

Pakistan vs Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు మారుతున్నాయి. తాలిబన్లకు, పాకిస్తాన్‌కు మధ్య విభేదాలు పొసగుతున్నాయి. తాలిబన్ల వార్నింగ్‌కు ప్రతిగా పాకిస్తాన్ చర్యలకు దిగింది. రెండు దేశాల మధ్య విమాన సర్వీసుల తగాగా పెరిగి పెద్దదవుతోంది.

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మారుతున్నాయా అన్పిస్తోంది. తాలిబన్లకు పాకిస్తానీయులకు మధ్య విభేధాలు పెరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మిత్రరాజ్యంగా ఉన్న పాకిస్తాన్ ఇప్పుడా దేశానికి పెద్ద షాకిచ్చింది. తాలిబన్ల(Talibans)అతిజోక్యంతో విసుగొచ్చి ఆ దేశానికి విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. ధరల్ని తగ్గించే ప్రసక్తే లేదని చెబుతూ..పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఫలితంగా ఆఫ్ఘన్‌కు నడుస్తున్న ఏకైక విదేశీ విమాన సర్వీస్ కూడా నిలిచిపోయింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించడానికి ముందు కాబూల్-ఇస్లామాబాద్ (Kabul-Islamabad Flight)మద్య విమాన టికెట్ 120-150 డాలర్ల మధ్య ఉండేది. ప్రస్తుతం ఈ ధర 2 వేల 5 వందల డాలర్లకు చేరుకుంది. దాంతో టికెట్ ధరలు తగ్గించాలని లేనిపక్షంలో విమాన సర్వీసుల్ని నిలిపివేస్తామని ముందు తాలిబన్ ప్రభుత్వం పాకిస్తాన్‌ను హెచ్చరించింది. తాలిబన్ల హెచ్చరికకు తాలిబన్ దీటుగా ప్రతిస్పందించింది. పాకిస్తాన్ కౌంటర్‌గా ఆ దేశానికి విమాన సర్వీసుల్ని నిలిపివేసింది. సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నా సరే..తాలిబన్లను ఇంతకాలం ఓపిగ్గా భరిస్తూ వచ్చామని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(Pakistan International Airlines) ప్రకటించింది. ఆగస్టు 15కు ముందున్న ధరలతో విమాన సర్వీసులు నడపాలని తాలిబన్లు అదేశించారు. కానీ కాబూల్ యుద్ధ ప్రాంతంగా మారడంతో ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రీమియం ధరల్ని భారీగా పెంచాయి. అందుకే టికెట్ ధరల్ని పెంచాల్సి వచ్చిందనేది పాకిస్తాన్ వాదన. ఇప్పటి వరకూ మానవతాకోణంలో విమాన సర్వీసుల్ని నడిపామని..ఇక టికెట్ ధరల్ని తగ్గించేది లేదని అంటోంది పాకిస్తాన్(Pakistan). 

Also read: WHO Experts Team: కరోనా మూలాల అణ్వేషణకు డబ్ల్యూహెచ్‌వో చివరి ప్రయత్నం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News