EPF Interest Rate: ఈపీఎఫ్ నుంచి గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ చేసే విషయమై ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతవడ్డీ ఎప్పుడు జమ చేసేది వెల్లడించింది. మీ ఎక్కౌంట్లో ఎంత జమ అయిందో ఇలా తెలుసుకోండి.
ఈపీఎఫ్ ఖాతాదారులైన 6 కోట్లమంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పీఎఫ్ కార్యాలయం శుభవార్త అందించింది. దీపావళికి ముందే వడ్డీ మొత్తాన్ని(PF Interest on Diwali)ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించుకుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి డిపాజిట్లపై వడ్డీరేటును 8.5శాతంగా నిర్ణయించింది. ఇటీవలే కేంద్ర ఆర్ధిక శాఖ..నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించింది. కరోనా వైరస్ సంక్రమణ తరువాత 2019-20 సంవత్సరానికి వడ్డీరేటును(Pf Interest Rate)ఏడేళ్ల కనిష్టం 8.5 శాతానికి తగ్గించింది ఈఫీఎఫ్(EPFO) సంస్థ. 2018-19లో వడ్డీరేటు 8.65 శాతం కాగా 2017-18లో 8.55 శాతంగా ఉంది. 2016-17లో మాత్రం 8.65 శాతముంది. కేంద్ర ప్రభుత్వం 2020 మార్చ్ నెలలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కొత్త నిబంధన విధించింది. ఈపీఎఫ్ సభ్యులు మూడు నెలల ప్రాథమిక వేతనం, కరువ భత్యం లేదా ప్రొవిడెంట్ ఫండ్ డబ్బులో 75 శాతం వరకూ అడ్వాన్స్‌గా తీసుకునే అవకాశాన్ని కల్పించింది.
ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ ఎలాగంటే
యూనివర్శల్ అక్కౌంట్ ద్వారా పీఎఫ్ ఖాతాదారులు బ్యాలెన్స్ చెక్(How to check Pf Balance) చేసుకోవచ్చు. ఎంత వడ్డీ జమ అయిందో తెలుసుకోవచ్చు. ఒక మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు రిజిస్టర్ మొబైల్‌కు వస్తాయి. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్ కు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అక్కౌంట్ బ్యాలెన్స్ , చివరి వాయిదా వివరాలు అందుతాయి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 011 22901406 నెంబర్ కు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
Also read: Swiss Bank: స్విస్ బ్యాంకు ఖాతా ఇక గోప్యం కాదు, మూడోసారి వివరాలు అందుకున్న ఇండియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి