US Nuclear Submarine: యూఎస్ అణు జలాంతర్గామికి ప్రమాదం, చైనా ఆందోళన

US Nuclear Submarine: అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం తలెత్తింది. నీటి అడుగుల గుర్తు తెలియని వస్తువును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏ మేరకు నష్టం జరిగింది, ఎవరికేమైందనే వివరాలు పరిశీలిద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 9, 2021, 07:31 AM IST
  • ప్రమాదానికి గురైన అమెరికా అణు జలాంతర్గామి యూఎస్ఎస్ కనెక్టికట్
  • దక్షిణ చైనా సముద్ర అంతర్భాగంలో గుర్తు తెలియని వస్తువును ఢీ కొన్న సబ్ మెరైన్
  • ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన చైనా
US Nuclear Submarine: యూఎస్ అణు జలాంతర్గామికి ప్రమాదం, చైనా ఆందోళన

US Nuclear Submarine: అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం తలెత్తింది. నీటి అడుగుల గుర్తు తెలియని వస్తువును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏ మేరకు నష్టం జరిగింది, ఎవరికేమైందనే వివరాలు పరిశీలిద్దాం.

దక్షిణ చైనా సముద్రంలో(South China Sea) అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి యూఎస్ఎస్ కనెక్టికట్ ప్రమాదానికి గురైంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. యూఎస్ఎస్ కనెక్టికట్ అంతర్జాతీయ జలాల్లో నీటి అడుగున గుర్తు తెలియని వస్తువును బలంగా ఢీ కొట్టింది. సముద్రంలో మునిగిపోయిన ఓడ లేదా మరో ఇతర వస్తువును ఢీ కొట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ జలాంతర్గామి ప్రస్తుతం గ్వామ్ వైపు వెళ్లోందని తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా మొత్తం వివరాల్ని వెల్లడించలేకపోతున్నట్టు తెలిసింది. ఈ ఘటన అనంతరం కూడా జలాంతర్గామిలోని(US Nuclear Submarine)న్యూక్లియర్ ప్రొపల్షన్ ప్లాంట్, ఇతర వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ తెలిపింది. ఈ ఘటనపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఘటన జరిగిన ప్రాంతం ఇతర వివరాల్ని వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. స్వేచ్ఛా సముద్రయానం పేరుతో అమెరికా చేస్తున్న వాయు, నౌకా విన్యాసాలే ఈ ఘటనకు కారణమని నిందించింది. మరోవైపు ఈ ఘటనలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదు.

Also read:  Supreme Court on Lakhimpur: లఖీంపూర్ నిందితుల్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News