Corona Vaccination Guidelines: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాల్ని జారీ చేసింది. వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లకు స్పష్టత ఇచ్చింది. రెండు రకాల వ్యాక్సిన్లను తీసుకోవచ్చో లేదో వివరణ ఇచ్చింది.
కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination) ప్రక్రియ దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అయితే ఇటీవల కొద్దికాలంగా రెండు వేర్వేలు వ్యాక్సిన్లు తీసుకోవచ్చా లేదా అనే విషయంపై సందిగ్దత నెలకొంది. మొదటి డోసు ఓ కంపెనీ, రెండవ డోసు మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అనే విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సిన్ల మార్పిడికి అనుమతి లేదని స్పష్టం చేసింది. మొదటి డోసు ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటారో రెండవ డోసు కూడా అదే కంపెనీ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. ఇతరత్రా చాలా అనుమానాల్ని నివృత్తి చేసింది. కోవిన్ యాప్‌తో అందరికీ ఒకే వ్యాక్సిన్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్వాహకులకు ఈ విధమైన మార్గదర్శకాలున్నాయని (Covid Vaccination Guidelines)కేంద్రం పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సిన్లు ఎంతకాలం కరోనా మహమ్మారి నుంచి రక్షణ కల్పిస్తాయో చెప్పలేమని తెలిపింది. రానున్న రోజుల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు అవసరమా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని కేంద్రం స్పష్టం చేసింది.
మరోవైపు వ్యాక్సినేషన్ పూర్తయ్యాక కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని..భౌతికదూరం పాటించాల్సిందేనని పేర్కొంది. ఎందుకంటే వైరస్ సంక్రమణను నియంత్రించేందుకు కోవిడ్ మార్గదర్శకాల్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరముంది. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిలో కరోనా యాంటీబాడీలు(Antibodies) ఎంతకాలం ఉంటాయనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
కరోనా వైరస్ నుంచి కోలుకున్న 3 నెలల తరువాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ వేసుకున్నవారికి 3 నెలల పాటు వ్యాక్సిన్ వాయిదా వేయాల్సి ఉంటుంది. మొదటి డోసు తీసుకున్న తరువాత కరోనా వైరస్ సోకితే..రెండవ డోసుకు 3 నెలలు వాయిదా వేయాలి. దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలున్నవారికి వ్యాక్సిన్ తో మేలు తప్ప నష్టం ఉండదని కేంద్రం సూచిస్తోంది. రెండు వ్యాక్సిన్లు పూర్తయిన తరువాత తగిన పరిణామంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. కరోనా వ్యాక్సిన్ మహిళల సంతానోత్పత్తిని ప్రభావితం చేయదు. వ్యాక్సిన్లను పూర్తి స్థాయిలో పరీక్షించిన తరువాతే అనుమతిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం(Central government) తెలిపింది.
Also read: lifestyle Diceases: పెరుగుతున్న బీపీ, షుగర్ వ్యాధుల నియంత్రణ ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook