లార్డ్స్ టెస్టులో అద్భుతమైన విజయం సాధించిన భారత్...అంతలోనే ఊసురుమనిపించే ప్రదర్శన కనబర్చింది. ఇంగ్లండ్ పేసర్లు ధాటికి..మన బ్యాట్స్‌మెన్ కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే చాపచుట్టేశారు.
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. జేమ్స్ అండర్సన్ మూడు కీలక వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. రోహిత్, రహానే మినహా మిగతా బ్యాట్స్ మెన్ ఎవరు రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
ఇంగ్లాండ్ పర్యటనలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్లాప్ షో కొనసాగుతోంది. హెడ్డింగ్లీలో జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మరోసారి జేమ్స్ ఆండర్సన్ కు దొరికిపోయాడు. కోహ్లీని అండర్సన్ ఇప్పటివరకు ఏడు సార్లు ఔట్ చేశాడుు. కోహ్లీ 17 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేశాడు. (Photo: Reuters)
లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మెుదటి రోజు ఆటలో డకౌట్ అయి పెవిలియన్ కు వెళ్తున్న కేఎల్ రాహుల్. (Photo: Twitter)
భారత నయావాల్ చతేశ్వర్ పుజారా మరోసారి నిరాశపరిచాడు. పుజారా కేవలం 9 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి క్యాచ్ ఔటయ్యాడు. (Photo: Reuters)
రిషబ్ పంత్, రహానేలను అవుట్ చేసిన ఆనందంలో ఇంగ్లాండ్ బౌలర్ ఒల్లీ రాబిన్సన్. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. (Photo: Twitter)