నీరజ్ చోప్రా.. పెద్దగా పరిచయం అవసరంలేని పేరు, టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics) అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం సాధించి సంచలనం శృష్టించిన 23 ఏళ్ల యువ అథ్లెట్ వీడియో సామాజిక మాద్యమాలలో తెగ వైరల్ అవుతుంది.
బంగారు పథకం సాధించటానికి నీరజ్ చోప్రా (Neeraj chopra) పడిన కష్టం అంతా ఇంతా కాదు.. ఒక్కరోజులోనో, ఒక నెలలో చేసిన సాధన కాదు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ వలన సాధ్యమైన ఒక ప్రదర్శన. ఇండియన్ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad kai) తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నీరజ్ పడిన కష్టానికి, తను చేసిన శ్రమకు అద్దం పడుతుంది. కాగా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయింది.
Meet our new hero! #NeerajChopra pic.twitter.com/8iihthXYuO
— Mohammad Kaif (@MohammadKaif) August 8, 2021
Also Read: Tokyo olympics: జయహో నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఫస్ట్ గోల్డ్‌మెడల్
ఈ వీడియోలో నీరజ్ చేతిలో బరువును పట్టుకొని వెనుకకు వంగి దాదాపు విల్లు లాగా, 180 డిగ్రీలుగా శరీరాన్ని వంచి, తిరిగి మళ్లీ విసరటం అందరిని అబ్బురపరుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వగా, "ఇదెలా సాధ్యం.. నీ కఠోర శ్రమకు హేట్సాఫ్" అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
హర్యానాలోని పానిపట్ ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా గతవారం జరిగిన టోక్యోలో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో 87.58 మీటర్లు విసిరి అద్భుత ప్రదర్శన చేశాడు. నీరజ్ చోప్రాతో పాటూ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఇతర విజేతలకు కేసుల ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం అందించిన తొలి వ్యక్తిగా.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా (Neeraj chopra) చరిత్ర శృష్టించి, దేశ ప్రతిష్టతను మరో మెట్టుకు ఎక్కించాడనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి.
Also Read: టోక్యో ఒలింపిక్స్: పీవీ సింధుకు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Neeraj Chopra: నెట్టింట్లో వైరల్ అవుతున్న నీరజ్ చోప్రా వీడియో
వైరల్ అవుతున్న నీరజ్ చోప్రా వీడియో
బరువుతో శరీరాన్ని విల్లులు లా వంచిన చోప్రా
నీరజ్ శ్రమను కొనియాడుతున్న నెటిజన్లు