టీడీపీ ఎంఎల్ఏ, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు గట్టి షాకే తగిలింది. బుధవారం భీమడోలు మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ దాడి కేసులో ఆయనకు శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. ఆ తరువాత ఆయన పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను విచారించిన భీమడోలు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
వివరాల్లోకి వెళితే.. 2011లో దెందులూరులో రచ్చబండ జరుగుతుండగా.. వట్టి వసంత్ కుమార్‌కు, టీడీపీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో చింతమనేని వసంత కుమార్ పై దాడి చేశారు. వసంత కుమార్ దాడి జరిగిన వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేయగా.. న్యాయస్థానం ఏడేళ్లు విచారించి దాడి జరిగిన మాట వాస్తవమే అని గుర్తించి.. చింతమనేని ప్రభాకర్‌కు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.