TS EAMCET, ECET, PGECET, ICET, LAWCET, EDCET, POLYCET exams dates: హైదరాబాద్ : తెలంగాణలో వాయిదా పడుతూ వచ్చిన ప్రవేశ పరీక్షల తేదీలపై ఓ స్పష్టత వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి చేపట్టనున్న అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్స్ ఖరారయ్యాయి. సోమవారం విద్యాశాఖ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు.
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్టు 4, 5 6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు (EAMCET -ENG), ఆగస్టు 9, 10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడిసిన్ ఎగ్జామ్స్ (EAMCET AM) ఉండనున్నాయి. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
Also read : Telangana COVID-19 updates: తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. పెరిగిన రికవరీ రేటు
ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్ పరీక్షలు (ICET exam), 23వ తేదీన లాసెట్ ప్రవేశ పరీక్ష, 24, 25వ తేదీల్లో ఎడ్‌సెట్ జరగనుండగా.. వీటన్నింటికంటే ముందుగా జూలై 17న పాలిసెట్ (POLY CET) ప్రవేశ పరీక్ష జరగనుంది.
Also read : HCU Admission Exam:హెచ్ సీయూ అడ్మిషన్లకు సిద్ధం, ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల
TS CETs schedules: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు