Bank Timings In Telangana: లాక్‌డౌన్‌లో తెలంగాణ బ్యాంకుల పనివేళలు మారాయి, కొత్త టైమింగ్స్ ఇవే

Bank Working Hours In Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ మరో 10 రోజులపాటు పొడిగింపుతో మెట్రోరైలు, ఆర్టీసీ సర్వీసులతో పాటు బ్యాంకు పనివేళలు మారాయి. నిన్నటివరకు బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలు అందించాయి. గురువారం నుంచి బ్యాంకుల పనివేళలు మారాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 10, 2021, 03:22 PM IST
  • తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఈ మేరకు హైదరాబాద్ మెట్రో, ఆర్టీసీ పనివేళల్లో మార్పులొచ్చాయి
  • బ్యాంకు పనివేళల్లో మార్పు, యథాతథంగా బ్యాంకు సిబ్బంది విధులు
Bank Timings In Telangana: లాక్‌డౌన్‌లో తెలంగాణ బ్యాంకుల పనివేళలు మారాయి, కొత్త టైమింగ్స్ ఇవే

Bank Working Hours In Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. నేటి (జూన్ 10) నుంచి జూన్ 19వ తేదీ వరకు పొడిగించిన లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. జూన్ 9 వరకు మధ్యాహ్నం 1 వరకు సడలింపు ఇవ్వగా, మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు ఇళ్లకు చేరుకునేవారు. తాజా సవరణలతో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు యథాతథంగా పనులు జరగనున్నాయి.

తెలంగాణలో లాక్‌డౌన్ మరో 10 రోజులపాటు పొడిగింపుతో మెట్రోరైలు, ఆర్టీసీ సర్వీసులతో పాటు బ్యాంకు పనివేళలు మారాయి. నిన్నటివరకు బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలు అందించాయి. తెలంగాణ లాక్‌డౌన్ వేళలు (Telangana lockdown timings) పొడిగింపుతో గురువారం నుంచి గతంలో మాదిరిగా రాష్ట్రంలోని బ్యాంకులు సేవలు సేవలు అందించనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమై గతంలో తరహాయలో సాయంత్రం వరకు బ్యాంకు ఉద్యోగులు పనిచేయనున్నారు. నిన్నటివరకూ బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటలకే సేవల్ని ముగించేవి. 

Also Read: Telangana lockdown timings: తెలంగాణ లాక్‌డౌన్ టైమింగ్స్‌లో సడలింపులు

బ్యాంకు పని ఉన్నవారు అవసరమైతేనే బ్యాంకుకు వెళ్లాలని అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వీలైతే ఇంటి నుంచే ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా సేవలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరమై బ్యాంకుకు వెళ్తున్న వారు కచ్చితంగా మాస్కు ధరించి రావాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని, భౌతికదూరం సైతం పాటించడం తప్పనిసరి అని కోవిడ్19 (Covid-19) నిబంధనల్ని మరోసారి గుర్తుచేశారు. ఎస్‌బీఐ సహా ఇతర బ్యాంకులు గతంలో తరహాలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు పూర్తిస్థాయిలో సిబ్బంది సేవలు అందించనున్నారు.

Also Read: Dos And Donts Of Solar Eclipse 2021: సూర్య గ్రహణం సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి జోలికి అసలు వెళ్లరాదు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News