స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎదురయ్యే సమస్యలలో డేటా స్టోరేజ్ ఒకటి. కొన్ని సంస్థలు ఉచిత స్టోరేజ్ అందించడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాన్నాం. ఇప్పటివరకూ మనం గూగుల్ ఫొటోస్‌లో 15 GB స్టోరేజీ వరకు ఫొటోలు మరియు వీడియోల (Google Photos Fee Storage)ను సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందుకోసం Google కంపెనీకి వినియోగదారులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. క్లౌడ్ డేటా స్టోరేజ్‌పై కొన్ని మార్పులు వచ్చాయి.
15 జీబీ డేటా వరకు మాత్రమే ఉచితంగా స్టోరేజ్ చేసుకోవచ్చు. డేటా స్టోరేజ్ పరిమితి మించితే జూన్ 1 నుంచి నగదు చెల్లించాల్సి ఉంటుంది. 15GB డేటా పరిమితి వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఉంటుందని, పరిమితి దాటితే కొంతమేర నగదు చెల్లించాలని ఈ మేరకు అమెరికా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు Google Photos And Videos 15 జీబీ పరిమితిని మించిన తరువాత Google ఫొటోలు మరియు వీడియోలు స్టోరేజీ కోసం నెలకు 1.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక సబ్‌స్క్రిప్షన్ 19.99 డాలర్లు. (భారత కరెన్సీలో దాదాపు రూ.1470).
Also Read: Best Pension Plans: బెస్ట్ పెన్షన్, సేవింగ్స్ ప్లాన్ కావాలంటే ఈ వివరాలు చదవండి
కాగా, గూగుల్ పిక్సెల్ 2 (Google Pixel 2) లేదా ఆ తరువాత మార్కెట్లోకి వచ్చిన పిక్సెల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు డేటా స్టోరేజీ సమస్య లేకుండా ఫొటోలు, వీడియోలను సేవ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. గూగుల్ పిక్సెల్ 2, 3, 4 మరియు గూగుల్ పిక్సెల్ 5 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉచితంగా హైక్వాలిటీ ఫొటోలు స్టోరేజ్ చేసుకుని ప్రయోజనం పొందనున్నారు.
Also Read: 2DG Drug Price: డీఆర్‌డీవో కరోనా మెడిసిన్ 2డీజీ ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
గూగుల్ ఇటీవల ప్రారంభించిన టూల్ ఉపయోగించి మీ గూగుల్ ఫొటోల స్టోరేజ్ (Google Maps Dark Theme Feature) ఎంత పూర్తయిందో సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా అవసరం లేని ఫొటోలు మరియు వీడియోలను డిలీట్ చేయడం ద్వారా స్టోరేజ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరోవైపు ఎప్పటికప్పుడూ మార్పులు గమనిస్తున్న నెటిజన్స్, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమకు ప్రత్యామ్నాయాన్ని సైతం తెలుసుకుని సమస్యల బారిన పడకుండా నడుచుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Google Photos Fee Storage: గూగుల్ ఫొటోస్ స్టోరేజీకి ఇకనుంచి డబ్బులు చెల్లించాలా
అకౌంట్లలో ఫొటోలు, వీడియోల డేటా స్టోరేజీపై గూగుల్ సరికొత్త నిర్ణయం
ఇప్పటివరకూ ఉచితంగా గూగుల్ ఫొటోస్, వీడియోలు స్టోరేజీ చేసుకోవచ్చు
జూన్ 1 నుంచి డేటా స్టోరేజీ పరిమితి దాటితే యూజర్లు డబ్బులు చెల్లించాలి