భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్లినా, అక్కడ ఘన స్వాగతం లభిస్తోంది. ప్రపంచదేశాలు భారత్‌కి ప్రాధాన్యత ఇవ్వడమేకాకుండా, భారత ప్రధానికి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయని చెప్పడానికి మరో నిదర్శనమే తాజాగా అబుధాబి పర్యటనలో మోడీకి లభించిన ఘన స్వాగతం. ప్రధాని హోదాలో రెండోసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లిన తొలి ప్రధానిగా మోడీ ఖాతాలో ఓ రికార్డ్ చేరితే, మోడీ రాకను గౌరవిస్తూ, వాళ్లు స్వాగతం పలికిన తీరు అద్భుతం.
When pictures speak louder than words pic.twitter.com/5JP3EVvte1
— IndAmbUAE (@navdeepsuri) February 10, 2018
ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్, దుబాయ్ ఫ్రేమ్, అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏబీఎన్ఓసీ) ప్రధాన కార్యాలయం భవన నిర్మాణాలు భారత ప్రధానికి స్వాగత తోరణాలుగా వెలిగిపోయాయి. అది కూడా మన భారతీయ జండాలోని మూడు రంగులని ఆవిష్కరించేలా యుఏఈ మోడీకి వెల్‌కమ్ చెప్పిన తీరు నిజంగా కనువిందు చేసింది.
الوان العلم الهندي تزين #جسر_الشيخ_زايد #في_أبوظبي ترحيباً بزيارة معالي رئيس الوزراء الهندي لدولة #الإمارات العربية المتحدة@IndembAbuDhabi pic.twitter.com/1gyuqnJhUg
— بلدية مدينة أبوظبي (@AbuDhabi_ADM) February 10, 2018
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రెండు అతిపెద్ద నగరాలైన దుబాయ్, అబుధాబిలలో శుక్రవారం రాత్రి కనిపించిన దృశ్యం ఇది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలిఫా టవర్‌కి ప్రపంచంలోనే అతి ఎత్తైన నిర్మాణంగా పేరుంది. 828 మీటర్ల ఎత్తైన ఈ టవర్‌పై త్రివర్ణ పతాకం వెలుగుతుంటే చూడటానికి ఆ దృశ్యం ఎలా వుంటుందో ఊహించుకోవడం కొంచెం కష్టమేనేమో. అంతేకాదు.. ఇంత భారీ సైజులో దీపకాంతులతో వెలిగిన త్రివర్ణ పతాకం నమూనాను చూడటం కూడా బహుషా ఇదే మొదటిసారి అయ్యుంటుంది.