White Fungus Symptoms: కరోనా మహమ్మారితో పోరాడుతున్న బాధితులు గత కొన్ని రోజులుగా బ్లాక్ ఫంగస్ అనే కొత్త సమస్య రావడంతో ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ కట్టడికి విఘాతం కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్ సమస్యకు పరిష్కారం వెతికేలోగా వైద్య రంగానికి వైట్ ఫంగస్ రూపంలో మరో సవాల్ ఎదురైంది. అసలే ఊపిరితిత్తుల సమస్య, మూడ్రపిండాల దెబ్బతినడం, మెదడుపై తీవ్ర ప్రభావం కారణంగా కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొందరు చనిపోతున్నారు.
మ్యూకోర్ మైకోసిస్ అనేది మానవ శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది. దీనిని బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ అని పిలుస్తున్నాం. ఇది కరోనా సోకిన వారి మెదడు, ఊపిరితిత్తులు, చర్మం, ముఖంపై దాడి చేస్తుంది. కొందరు బాధితులు కంటి చూపు సైతం కోల్పోయారు. ఈ క్రమంలో వైద్యశాఖకు మరో సవాల్ ఎదురైంది. బిహార్ రాజధాని పాట్నాలో 4 వైట్ ఫంగస్ కేసుల్ని వైద్యులు గుర్తించారు. అయితే కోవిడ్19 బారి నుంచి కోలుకున్న వారిలోనే వైట్ ఫంగస్ కేసులు రావడం ఆందోళన పెంచుతోంది. బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కన్నా వైట్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Black Fungus: బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌పై Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం
ఊపిరితిత్తులు, గోళ్లు, చర్మం, ఉదరం, మూత్రపిండాలు, మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలు, నోరు లాంటి భాగాలపై వైట్ ఫంగస్ దాడి చేస్తుంది. కరోనా లక్షణాలు కనిపించడంతో వీరికి టెస్టులు చేయగా ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. కోవిడ్19 వైరస్ సోకకున్నా వైట్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ నమోదయ్యాయని పీఎంసీహెచ్ మైక్రోబయాలీ విభాగం అధిపతి డాక్టర్ ఎస్ఎన్ సింగ్ ఈ విషయాలు వెల్లడించారు. యాంటీ ఫంగల్ మెడిసిన్ వాడకం ద్వారా ఆ నలుగురు కోలుకున్నారని, వారికి ప్రస్తుతం నెగెటివ్ అని తేలినట్లు తెలిపారు. హెచ్ఆర్‌సీటీ స్కాన్ ద్వారా వైట్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ ప్రభావాన్ని గుర్తించడం సాధ్యపడుతుందన్నారు.
Also Read: Black Fungus Symptoms: బ్లాక్ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి..ఎవరికి ముప్పు ఎక్కువంటే
వైట్ ఫంగస్ లక్షణాలు సైతం కరోనా వైరస్ మరియు బ్లాక్ ఫంగస్ లక్షణాలను పోలి ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ ఎస్ఎన్ సింగ్ హెచ్చరించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, షుగర్ పేషెంట్లు లేదా సుదీర్ఘకాలం నుంచి స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారికి వైట్ ఫంగస్ సోకుతుందని వెల్లడించారు. మరోవైపు రాజస్థాన్, తెలంగాణ ప్రభుత్వాల తరహాలోనే మ్యూకర్ మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్‌ను నోటిఫైయబుల్ డిసీజ్‌గా గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఇతర రాష్ట్రాలకు సూచించింది.
Also Read: Black Fungus Threat: ప్రాణాంతక బ్లాక్ ఫంగస్‌పై హెచ్చరికలు జారీ చేసిన ఎయిమ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook