Central government on vaccines: కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో సుప్రీంకోర్టు వర్సెస్ కేంద్ర ప్రభుత్వ వాదన కొనసాగుతోంది. వ్యాక్సిన్ ధరలు, వ్యాక్సిన్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
దేశంలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) అతి భయంకరంగా విస్తరిస్తోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. అంతేకాకుండా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలు ఒకే వ్యాక్సిన్‌కు మూడు ధరలు ప్రకటించాయి. ఇదే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కేంద్రానికి 150 రూపాయలకు అమ్ముతున్న ఈ వ్యాక్సిన్‌ను..రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు మరో ధర నిర్ణయించాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ అయితే రాష్ట్రాలకు 3 వందల రూపాయలకు, భారత్ బయోటెక్ అయితే రాష్ట్రాలకు 4 వందల రూపాయలకు ధర నిర్ణయించాయి. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
ఈ నేపధ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం (Central government) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ విధానాన్ని పూర్తిగా సమర్ధించుకుంది. అంతేకాకుండా ఈ విషయంలో న్యాయస్థానాల జోక్యం అనవసరమని తేల్చి చెప్పింది. వ్యాక్సిన్లపై నిర్ణయాల్ని మాకు వదిలేయండి..ప్రజల ప్రయోజనార్ధం మెడికల్, సైంటిఫిక్ నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లో చెప్పింది. వ్యాక్సిన్ ధరల్ని మరోసారి పరిశీలించాలని గత వారం కేంద్రాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) కోరిన నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. ఈ విషయంలో కోర్టు జోక్యం వద్దని కేంద్రం వాదిస్తోంది. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పాలకులకే ఈ నిర్ణయాన్ని వదిలేయండి అంటూ అఫిడివిట్లో తెలిపింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు గతంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించి జాతీయ వ్యాక్సినేషన్ విధానానికి కూడా తిలోదకాలిచ్చినట్టైంది.
Also read: West Bengal Cabinet: పశ్చిమ బెంగాల్లో జంబో కేబినెట్, కాస్సేపట్లో ప్రమాణ స్వీకారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook