Polavaram lift irrigation: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా మరో ప్రాజెక్టు రాబోతోంది. పోలవరం ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 9 వందల కోట్లతో చేపట్టనున్న ఈ పథకానికి పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పూర్తయితే గోదావరి డెల్టాలో రెండు పంటలకు సమృద్ధిగా నీరందుతుంది. అయితే పోలవరం ప్రాజెక్టు కనీస నీటిమట్టం 41.5 మీటర్లగా ఉంది. ప్రాజెక్టులో 35.50 మీటర్ల స్థాయిలో నీరుంటేనే కుడికాలువ (Polavaram Right canal) ద్వారా గ్రావిటీపై నీళ్లు తరలించవచ్చు. అంతకంటే తక్కువ అంటే 35.50 మీటర్ల కంటే తక్కువ నీటిమట్టమున్నప్పుడు కుడికాలువలోకి చుక్క నీరు వెళ్లే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి సాధారణంగా ప్రతియేటా జనవరి- ఏప్రిల్ మధ్యన అంటే రబీ పంటకు ఎదురయ్యే అవకాశముంది. అందుకే రబీ పంట(Rabi Crop) కు సమృద్ధిగా నీరందించాలంటే ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలైన మెట్ట ప్రాంతాల గృహ అవసరాలు తీర్చడానికి మరో పథకం అవసరముంది. అదే పోలవరం ఎత్తిపోతల పథకం( Polavaram Lift Irrigation). 912.84 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలు వర్షాభావ పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నాయి. వేసవిలో ఈ ప్రాంతాల్లో తాగునీరు, గృహ అవసరాల కోసం తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో 35.50 మీటర్ల నుంచి 32 మీటర్ల వరకు ఉన్న నీటిని జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కుడి కాలువ అనుసంధానంలోకి ఎత్తిపోసి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో గృహ అవసరాలకు సరఫరా చేయవచ్చంటూ జనవరి 22వ తేదీన పోలవరం సీఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ పధకం ద్వారా పోలవరం ప్రాజెక్టులో 32 మీటర్లకు దిగువన ఉన్న నీటిని గోదావరి డెల్టా(Godavari Delta) లో రబీ పంటలకు సమృద్ధిగా సరఫరా చేయవచ్చు. ఈ ఎత్తిపోతల పనులు చేపట్టడానికి, 15 ఏళ్లు ఆ పథకం నిర్వహణకు 912.84 కోట్లతో ప్రభుత్వం ( Ap government) పరిపాలన అనుమతిచ్చింది.
Also read: Eluru Corporation Result: ఏలూరు కార్పొరేషన్ ఫలితాలపై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Polavaram lift irrigation: పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా మరో ఎత్తిపోతల పథకం