ఇండియా vs సౌతాఫ్రికా 3వ వన్డే: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

బుధవారం కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే ప్రారంభమయింది.

Last Updated : Feb 8, 2018, 12:57 AM IST
ఇండియా vs సౌతాఫ్రికా 3వ వన్డే: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా

కేప్ టౌన్ (దక్షిణాఫ్రికా): బుధవారం కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే ప్రారంభమయింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ కు దిగింది.    

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గత రెండు వన్డేల్లో గెలిచిన అదే ఆట జట్టుతో బరిలోకి దింపారు. అయితే దక్షిణాఫ్రికా క్విన్టన్ డీ కోక్, మోర్నే మోర్కెల్ స్థానంలో పేసర్ లుంగీ న్గిది, కుడిచేతి బ్యాట్స్ మెన్ హీన్రిచ్ క్లాసెన్ లను తొలిసారి జట్టులోకి తీసుకుంది. అలానే ఆండీ ఫెహ్లగ్వేవోను ఎడమ చేతివాటం స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ స్థానంలో జట్టులోకి తీసుకుంది.

కాగా, డర్బన్, సెంచూరియన్ లలో ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డే మ్యాచ్ లను భారత్ కైవసం చేసుకుంది. 6 వన్డేల సిరీస్ లో 2-0 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. అయితే మూడో మ్యాచ్ లోనూ గెలుపొందాలని భారత్ భావిస్తోంది. అయితే రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన సౌతాఫ్రికా మూడో మ్యాచ్ లోనైనా గెలుపొందాలని చూస్తోంది.

భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, ఎం ఎస్ ధోనీ(వికెట్ కీపర్), కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

దక్షిణాఫ్రికా జట్టు: హషిమ్ ఆమ్లా, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), జెపి డుమిని, హేయిన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లెర్, ఖయా జోండో, క్రిస్ మోరిస్, ఆండిల్ ఫెహ్లక్వేవో, కగిసో రబడ, లుంగీ  న్గిది, ఇమ్రాన్ తహిర్

కాగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కడపటి వార్తలందేసరికి 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. రోహిత్ శర్మ తొలి ఓవర్ చివరికి బంతికే డకౌట్ అయ్యాడు.  రబడ బౌలింగ్ లో కీపర్ క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి ఉన్నారు.

Trending News