Ben Stokes Ruled Out Of IPL 2021: ఓటమితో ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభించిన రాజస్తాన్ రాయల్స్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కేవలం ఒకే మ్యాచ్ ఆడిన బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.
ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆడిన బంతిని క్యాచ్ పట్టేందుకు బెన్ స్టోక్ ముందుకు డైవ్ చేసి క్యాచ్ పట్టాడు. కానీ క్యాచ్ అందుకునే క్రమంలో ఎడమ చేతి వేలికి తీవ్ర గాయమైంది. దాంతో మైదానాన్ని వీడాడు. అయితే గాయం తీవ్రత అధికంగా ఉండటంతో ఐపీఎల్ 2021(IPL 2021)లో బెన్ స్టోక్స్ ఇక అందుబాటులో ఉండవని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. వేలు విరగడంతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నాడు. అయినా జట్టుకు తన సపోర్ట్ అందిస్తాడని తమ ట్వీట్‌లో పేర్కొంది.
Also Read: IPL 2021 RR vs PBKS Highlights: నిషేధం ఎదుర్కొన్న బాధ Deepak Hooda బ్యాటింగ్‌లో కనిపించింది
Ben Stokes has been ruled out of the IPL following a broken finger in last night's game. 😔
He will stay with the Royals and support the rest of the group in the upcoming matches. 💗#RoyalsFamily | @benstokes38 pic.twitter.com/WVUIFmPLMJ
— Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2021
‘రాజస్తాన్ రాయల్స్ జట్టులో బెన్ స్టోక్స్ కీలక ఆటగాడు. మైదానంలోనే కాక డ్రెస్సింగ్ రూమ్, ఆఫ్ ద ఫీల్డ్‌లో అతడి సేవలు మాకు విలువైనవి. అతుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. జట్టుకు దూరమైనా మేనేజ్‌మెంట్, టీమ్‌కు తన విలువైన సలహాలు ఇవ్వనున్నాడు. జట్టు బలబలాలు, బలహీనత మార్పుల విషయంలో బెన్ స్టోక్స్(Ben Stokes) సేవలు వినియోగించుకుంటామని’ ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: SRH vs KKR Match Highlights: ఐపీఎల్ చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
ఇటీవల జోఫ్రా ఆర్చర్ లాంటి కీలక ఆటగాడి సేవల్ని రాజస్తాన్ రాయల్స్ కోల్పోయింది. 26 ఏళ్ల ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే గాయపడ్డాడు. చేతికి గాయం కారణంగా తాను ఐపీఎల్ 2021కు అందుబాటులో ఉండలేనని మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించాడు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో అతడు పూర్తిస్థాయిలో కోలుకుని ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు సేవలు అందించనున్నాడని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook