Fuel prices hike: రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు ఆందోళన కల్గిస్తున్నాయి. పెట్రో డీజిల్ ధరల పెరుగుదల దేశ ఆర్ధిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయా అంటే అవుననే సమాధానమిస్తున్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఇంధన ధరల పెరుగుదలపై ఆర్బీఐ గవర్నర్ చేసిన వ్యాఖ్యలేంటి.
భారతదేశంలో ఇంధన ధరలు ( Fuel prices)రోజూరోజుకూ పెరిగిపోతున్నాయి. కొన్ని రాష్ట్ర్లాల్లో ఇప్పటికే సెంచరీ అంటే హండ్రెడ్ మార్క్ దాటేయగా..మరి కొన్ని ప్రాంతాల్లో వందకు చేరువలో ఉంది పెట్రోల్ ధర. ప్రతి రోజూ ధరల్లో పెరుగుదల కన్పిస్తూనే ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలు దాటేసింది. రెండ్రోజుల క్రితం కూడా లీటర్‌పై 35 పైసల వరకూ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర 91 రూపాయలు కాగా, ముంబైలో 97 రూపాయలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 96.50 రూపాయలుగా ఉంది. ఈ నేపధ్యంలో గవర్నర్ శక్తికాంత దాస్ సైతం పెరుగుతున్న ఇంధన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్వీట్ ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు.
Diesel &petrol prices do have an impact on the cost side. They play as cost push factor across a range of activities. It's not just that passengers who use cars and bikes. High fuel prices also have an impact on cost of manufacturing, transportation & other aspects: RBI Governor pic.twitter.com/zn4AzB5Ag8
— ANI (@ANI) February 25, 2021
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అనేది ధరలపై ప్రభావం చూపుతాయని..ఇతర కార్యక్రమాలపై కచ్చితంగా ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్( RBI Governor Shaktikanta das)అన్నారు. కార్లు, బైక్‌లు వినియోగించేవారిపైనే కాకుండా తయారీ, రవాణా రంగాల్ని తీవ్రంగా దెబ్బతీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర వ్యాపార వ్యయాల్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు డిజిటల్ కరెన్సీ( Digital currency)ఆవిష్కారంపై ఆర్బీఐ కసరత్తు చేస్తోందని శక్తికాంత దాస్ తెలిపారు. తాము తీసుకురానున్న డిజిటల్ కరెన్సీ..క్రిప్టోకరెన్సీ( Cryptocurrency) కంటే భిన్నంగా ఉండబోతుందని చెప్పారు. క్రిప్టోకరెన్సీ అనేది ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉన్న ఇండియాను ప్రభావితం చేయనుందని ఇప్పటికే ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో సొంతంగా డిజిటల్ కరెన్సీ తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే దేశీయంగా అతిపెద్ద ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా డిజిటల్ కరెన్సీను నిషేధించాలని కోరారు.
Also read: Petrol Price Today: వరుసగా రెండోరోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధర, లేటెస్ట్ రేట్లు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook