స్మార్ట్ ఫోన్స్ ధరలపై ప్రభావం చూపనున్న కేంద్రం నిర్ణయం

స్మార్ట్ ఫోన్స్‌ దిగుమతిపై కస్టమ్స్ సుంకం పెంపు

Last Updated : Feb 2, 2018, 12:06 PM IST
స్మార్ట్ ఫోన్స్ ధరలపై ప్రభావం చూపనున్న కేంద్రం నిర్ణయం

స్మార్ట్ ఫోన్ మొబైల్ విడిభాగాలు, పరికరాల దిగుమతులపై కస్టమ్స్ సుంకం 20 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దేశీయ మొబైల్ ఫోన్ తయారీదారులని ప్రోత్సహించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఇదివరకు 15 శాతంగా వున్న ఈ కస్టమ్స్ సుంకం ఇకపై 20 శాతం కానుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఇకపై భారత్‌కి దిగుమతి అయ్యే స్మార్ట్ ఫోన్ల ధరలకి రెక్కలు రానున్నాయి. 

స్మార్ట్ ఫోన్స్‌ దిగుమతిపై కస్టమ్స్ సుంకం పెంపు నిర్ణయం కారణంగా దేశీయంగా ఫోన్ల ఉత్పత్తి పెరగడమే కాకుండా భారత్‌లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. గత డిసెంబర్‌లో వివిధ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం పెంచిన కేంద్రం అదే సమయంలో స్మార్ట్ ఫోన్స్ దిగుమతులపై అప్పటివరకు 10 శాతంగా వున్న కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Trending News