ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు సొంత రాష్ట్రంలో పరాభవం ఎదురైంది. ఒక మహిళ పట్నాయక్ పై కోడిగుడ్ల దాడికి పాల్పడింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర మనస్తాపం చెందటంతోనే ఆమె ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని బాలాసోర్ లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బహిరంగ సభలో పాల్గొనటానికి వచ్చారు. నవీన్ పట్నాయక్ సభలో మాట్లాడుతున్నప్పుడు సభికుల్లోంచి ఒక మహిళ ఆకస్మాత్తుగా వచ్చి.. ఆయనపై కోడిగుడ్లు విసిరేసింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి భద్రతా సిబ్బంది సిఎంకు రక్షణగా నిలబడ్డారు. కాగా దాడికి ఒడిగట్టింది బిజేపీ నేత భార్య కావడం గమనార్హం. ఓడిశా సీఎం తన భర్తను జైలుకు పంపించారని.. అందుకే ఈ దాడికి పాల్పడినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH: Woman threw eggs on CM Naveen Patnaik during an event in Balasore, Odisha. pic.twitter.com/2nwWzsH3nj
— ANI (@ANI) January 31, 2018