Joe Biden Signatures: కీలక ఉత్తర్వులపై సంతకాలు, కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం ఇక అమలు

Joe Biden Signatures: కొత్త చట్టాలు చేయడం లేదు. కొత్త చట్టాల్ని చేయాల్సిన అవసరం లేదు. చెడ్డపేరు తెచ్చిన పాత చట్టాల్ని రద్దు చేస్తే కొత్త చట్టాలు తెచ్చినట్టే. అదే పని చేస్తున్నాను..కీలక ఉత్తర్వులపై సంతకాలు చేస్తూ జో బిడెన్ చెప్పిన మాటలివి..

Last Updated : Feb 5, 2021, 12:24 PM IST
Joe Biden Signatures: కీలక ఉత్తర్వులపై సంతకాలు, కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టం ఇక అమలు

Joe Biden Signatures: కొత్త చట్టాలు చేయడం లేదు. కొత్త చట్టాల్ని చేయాల్సిన అవసరం లేదు. చెడ్డపేరు తెచ్చిన పాత చట్టాల్ని రద్దు చేస్తే కొత్త చట్టాలు తెచ్చినట్టే. అదే పని చేస్తున్నాను..కీలక ఉత్తర్వులపై సంతకాలు చేస్తూ జో బిడెన్ చెప్పిన మాటలివి..

అమెరికా ( America ) నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బిడెన్ ( Joe Biden ) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 3 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ( Joe Biden signed on executive orders ) సంతకాలు చేశారు. దేశానికి చెడ్డపేరు తెచ్చిన గత ప్రభుత్వ విధానాల్ని సరిచేస్తున్నట్టు జో బిడెన్ ప్రకటించారు. ముఖ్యంగా జీరో టాలరెన్స్ విధానాన్ని రద్దు చేశారు. జీరో టాలరెన్స్ ( Zero Tolerance ) పేరిట ట్రంప్ చేపట్టిన చర్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ హయాంలో తల్లిదండ్రుల్నించి పిల్లల్ని వేరు చేసి..నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారు. వలసవాదులపై ఉక్కుపాదం మోపే క్రమంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. విమర్శల పాలైంది. 

అమెరికా దేశం ఏర్పడిందే వలసలతో అయినప్పుడు మెక్సికో సరిహద్దుల్లో గోడ ( Mexico wall ) కట్టాలన్న  డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) నిర్ణయం అసమంజసమన్నారు జో బిడెన్. మరోవైపు గ్రీన్‌కార్డు ( Greencard ) కోసం ఎదురుచూస్తున్నవారికి అనుకూలంగా బిడెన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త ఇమ్మిగ్రేషన్ పాలసీ ( New Immigration policy ) పై సంతకం చేశారు. అమెరికా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న కోటి పది లక్షలమందిలో కొత్త ఆశలు చిగురించాయి. అటు భారతీయులకు సైతం జో బిడెన్ తీసుకున్న కీలక నిర్ణయాలతో మేలు చేకూరనుంది. 

Also read: Heavy Snowfall: మంచుతుపానులో కూరుకుపోయిన అమెరికా, మరో రెండు వారాలు తప్పదని హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News