వెజిటేరియన్ ఫుడ్ అని చెప్పి ఓ కళాశాల క్యాంటిన్ యాజమాన్యం విద్యార్థుల చేత చేత బీఫ్ కట్లెట్లు తినిపించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళలోని పులిన్‌కున్నూ కళాశాలకి ఓ ఈవెంట్‌లో పాల్గొనడానికి వచ్చిన బిహార్ విద్యార్థులు కొందరు ఈ విషయమై స్థానిక కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 25వ తేదీన ఈ సంఘటన జరిగిందని వారు తెలిపారు. ఇతరుల ఆహారపు అలవాట్లపై తమకు గౌరవం ఉందని.. అయితే అబద్ధం చెప్పి ఆ క్యాంటిన్ యాజమాన్యం తమతో అలా బీఫ్ తినిపించకుండా ఉండాల్సిందని విద్యార్థులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనపై విచారణ కొనసాగుతోంది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోకి వచ్చే ఈ కళాశాల క్యాంటీన్‌లో ఎంతకాలం నుండి ఫుడ్ సప్లై చేస్తున్నారు అన్న అంశంపై కూడా ప్రస్తుతం ఎంక్వయిరీ జరుగుతున్నట్లు సమాచారం
వెజిటేరియన్ ఫుడ్ పేరుతో బీఫ్ సప్లై..!