AP: చంద్రబాబుపై విమర్శలు సంధించిన టీడీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే..చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

Last Updated : Dec 26, 2020, 04:05 PM IST
AP: చంద్రబాబుపై విమర్శలు సంధించిన టీడీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే..చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇళ్ల పట్టాల పంపిణీ ( House sites Distribution ) రెండోరోజు కొనసాగుతోంది. నియోజకవర్గాల వారీగా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో 25 వేల 5 వందల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలందిస్తున్నట్టు చెప్పిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ( Tdp mla Vallabhaneni vamsi )..పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

చంద్రబాబు హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలివ్వలేదని..ఇప్పుడిస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు వల్లభనేని వంశీ.  పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు ( Chandrababu )కు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. అసలు 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని అడిగారు ఎమ్మెల్యే వంశీ. ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతి జరిగితే..టీడీపీ నేతలు నిరూపించవచ్చని టీడీపీ ఎమ్మెల్యేనే సవాలు విసరడం గమనార్హం. టీడీపీ ప్రభుత్వం ( Tdp Government )లో పేదవారికి ఇళ్లు ఇచ్చేందుకు చంద్రబాబుకు మనసు రాలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan )..9 వేల కోట్ల వెచ్చించి భూముల్ని ఖరీదు చేసి మరీ పేదలకు ఇస్తున్నారని గుర్తు చేశారు. 

ఇప్పుడు జగన్ హయాంలో టీడీపీ చెందినవారికి కూడా ఇళ్ల పట్టాలిస్తున్నారని వంశీ చెప్పారు. ప్రజలు సంతోషంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదని..అందుకే విమర్శలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోలవరం నిర్మించకుండానే భజనలు చేయించుకున్న సంగతిని గుర్తు చేశారు.

Also read: AP: రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభం

Trending News