Bigg Boss 4 contestant Sohel: సోహెల్‌ టాలెంట్‌కి బ్రహ్మానందం ఫిదా.. సోహెల్ సినిమాకు తనవంతు సాయం

Bigg Boss 4 contestant Sohel meets Brahmanandam: బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ ఫినాలె వరకు వెళ్లి చిట్టచివరి వరకు టఫ్ పోటీ ఇచ్చి గ్రాండ్ ఫినాలె ఎపిసోడ్‌లో మూడో స్థానం వరకు కొనసాగిన బిగ్ బాస్ కంటెస్టంట్ సోహెల్ కథ వేరే ఉంటది.. కథ వేరే ఉంటది అనుకుంటూనే మాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు.

Last Updated : Dec 22, 2020, 06:03 PM IST
  • బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ ఫినాలె వరకు వెళ్లి చిట్టచివరి వరకు టఫ్ పోటీ ఇచ్చిన సోహెల్.
  • బిగ్ బాస్ హౌజ్‌లో సోహెల్ మేనరిజంకు ఫిదా అయిన చిరంజీవి
  • బిగ్ బాస్ హౌజ్ నుంచి సగం ప్రైజ్ మనీతో ఎలిమినేట్ అయిన సోహెల్
  • సోహెల్‌ సినిమాకు సాయం చేస్తామన్న వారిలో చిరు, నాగ్ సరసన చేరిన బ్రహ్మానందం.
Bigg Boss 4 contestant Sohel: సోహెల్‌ టాలెంట్‌కి బ్రహ్మానందం ఫిదా.. సోహెల్ సినిమాకు తనవంతు సాయం

Bigg Boss 4 contestant Sohel meets Brahmanandam: బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ ఫినాలె వరకు వెళ్లి చిట్టచివరి వరకు టఫ్ పోటీ ఇచ్చి గ్రాండ్ ఫినాలె ఎపిసోడ్‌లో మూడో స్థానం వరకు కొనసాగిన బిగ్ బాస్ కంటెస్టంట్ సోహెల్ కథ వేరే ఉంటది.. కథ వేరే ఉంటది అనుకుంటూనే మాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. చివర్లో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల సగం ప్రైజ్ మనీ తీసుకుని బిగ్ బాస్ నుంచి తనకు తానే ఎలిమినేట్ చేసుకున్నాడు. 

తాను గెల్చుకున్న రూ. 25 లక్షల్లోంచే రూ. 5 లక్షలు అనాధాశ్రమానికి, మరో రూ 5 లక్షలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్న తన స్నేహితుడు మెహబూబ్‌కి ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. అయితే, సోహెల్ చేసిన ప్రకటనపై మెహబూబ్ స్పందిస్తూ.. సోహెల్ తనకి ఇవ్వనున్న రూ. 5 లక్షలను తాను కూడా అనాథాశ్రమానికే ఇవ్వనున్నట్టు తెలిపాడు. మరోవైపు సోహెల్ పరిస్థితి గురించి ఐడియా ఉన్న బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా దీనిపై స్పందిస్తూ.. మీరు ఎవ్వరూ అనాధాశ్రమానికి ఇవ్వనక్కర్లేదు.. ఎందుకంటే మీ బదులుగా నేనే అనాథాశ్రమానికి ఆ డబ్బులు ఇస్తానంటూ సోహెల్‌కి ( Sohel ) మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also read : Bigg Boss 4 Telugu winner Abhijeet Duddala: బిగ్ బాస్ 4 తెలుగు విన్నర్ అభిజీత్ 

మరోవైపు బిగ్ బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలెకు చీఫ్ గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi about Sohel ) సైతం సోహెల్ గురించి స్పందిస్తూ... మన కథ వేరే ఉంటది అనే సోహెల్ మేనరిజం తనకు బాగా నచ్చిందని.. తన తర్వాతి సినిమాలో ఆ డైలాగుని వాడుకుంటానని చెప్పి అతడి పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌజ్‌లో ఉండగా ఒక టాస్కులో ఓడిపోయి నాన్ వెజ్‌కి దూరమైన సోహెల్ నాన్ వెజ్ తినలేకపోతున్నందుకు అల్లాడిపోవడం చూసిన మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ..  సోహెల్‌ కోసం ప్రత్యేకంగా బిర్యాని, మిర్చికా సాలన్ ( Biryani with mirchi ka salan ) చేసి పంపిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. సోహెల్ చేయనున్న సినిమాను ప్రమోట్ చేస్తాం అని చిరు, నాగ్ చెప్పడం ఇంకో ఎత్తు.

అలా నాగార్జున, చిరంజీవి మనసు గెల్చుకున్న సోహెల్ కోసం తాజాగా బ్రహ్మానందం సైతం ముందుకొచ్చాడు. సోహెల్‌ని తన వద్దకు పిలిపించుకున్న బ్రహ్మానందం.. భవిష్యత్తులో సోహెల్ చేయనున్న సినిమాలో తాను ఉచితంగా.. అంటే ఏ పారితోషికం ( Brahmanandam's remuneration ) లేకుండా నటించనున్నట్టు హామీ ఇచ్చాడట. బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షో ( Bigg Boss 4 Telugu ) ఇచ్చిన పాపులారిటీతో నటుడిగా పేరు తెచ్చుకోవాలని పరితపిస్తున్న సోహెల్‌కి ఇంతకంటే ఇంకా ఎక్కువ బూస్టింగ్ ఇంకేం కావాలి చెప్పండి.

Also read : Who will be the Bigg Boss 4 Telugu winner: బిగ్ బాస్ తెలుగు 4 విన్నర్ అతడే : అలీ రెజా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News