"పద్మావత్"ని ఆపకపోతే.. ఆత్మహత్యలు చేసుకుంటారట

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన "పద్మావత్" సినిమాని విడుదల చేస్తే.. తాము ఆత్మహత్యలు చేసుకుంటామని చిత్తోడ్‌గఢ్ ప్రాంతానికి చెందిన క్షత్రియ స్త్రీలు బహిరంగ ప్రకటన చేశారు.

Last Updated : Jan 15, 2018, 10:11 AM IST
"పద్మావత్"ని ఆపకపోతే.. ఆత్మహత్యలు చేసుకుంటారట

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన "పద్మావత్" సినిమాని విడుదల చేస్తే.. తాము ఆత్మహత్యలు చేసుకుంటామని చిత్తోడ్‌గఢ్ ప్రాంతానికి చెందిన క్షత్రియ స్త్రీలు బహిరంగ ప్రకటన చేశారు. ఒకప్పుడు పరాయి రాజ్యాలు కోటలను ముట్టడించి.. తమను కూడా లొంగదీసుకోవాలని ప్రయత్నించినప్పడు.. మానాల్ని కాపాడుకోవడానికి తమజాతి స్త్రీలు జోహర్ పద్ధతిని అనుసరించేవారని  తెలిపారు.

జోహర్ అంటే స్త్రీలు తమ మానాన్ని రక్షించుకోవడం కోసం మూకుమ్మడిగా అగ్నికి ఆహుతయ్యే పద్ధతి. చిత్తోడ్‌గఢ్ ప్రాంతంలో నిర్వహించిన 'సర్వసమాజ్' మీటింగ్‌లో ఈ నిర్ణయాన్ని తాము తీసుకంటున్నట్లు దాదాపు 100 మంది స్త్రీలు బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పటికే "పద్మావత్" చిత్రానికి సెన్సార్ పూర్తయ్యి, ఈ నెల 25వ తేదిన విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. 

ఈ క్రమంలో క్షత్రియ స్త్రీలు ఈ నిర్ణయం తీసుకోవడం పలు చర్చలకు దారితీసింది. ఒకవేళ చిత్రం విడుదలయ్యాక, జరగరాని ఘటనలు ఏవైనా జరిగితే..ఎవరు బాధ్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం రాజపుత్ర కర్ణిసేన ఆధ్వర్యంలో పలువురు కమిటీ సభ్యులు "పద్మావత్" రిలీజ్ ఆపించడం కోసం వినతి పత్రాన్ని హోం మినిస్టర్ రాజనాథ్ సింగ్‌కి సమర్పించడానికి ఢిల్లీ వెళ్తు్న్నారు. 

 

Trending News