హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం పార్టీ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి ప్రతినిధులుగా ఉన్న నేతలను హైదరాబాద్‌కి పిలిపించుకున్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి వారితో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో ఓవైపు మమతా బెనర్జీ సర్కార్‌కి బీజేపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో తమ పార్టీని కూడా అక్కడి అసెంబ్లీ ఎన్నికల ( West Bengal assembly elections 2021 ) బరిలో నిలపాలని అసదుద్దీన్ ఒవైసి భావిస్తున్నట్టు సమాచారం. అయితే అంతకంటే ముందుగా అక్కడ పార్టీకి ఉన్న బలాబలాలు, ఏయే ప్రాంతాల్లో పార్టీకి ఎలా ఆధరణ ఉందనే కోణంలో అసదుద్దీన్ ఒవైసి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
AIMIM chief Asaduddin Owaisi meets party functionaries from West Bengal ahead of the upcoming assembly election in the state, in Hyderabad. pic.twitter.com/eXcgYh8Pqj
— ANI (@ANI) December 12, 2020
Also read : TRS MLA Muthireddy Yadagiri Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చేదు అనుభవం
ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించి అక్కడ తమ ఉనికిని చాటుకుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అసదుద్దీన్ ఒవైసి ( Asaduddin Owaisi ) దృష్టిసారించడానికి అది కూడా ఓ కారణమై ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook