Oxford vaccine in india: ఇండియాలో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలుసా..

Oxford vaccine in india : ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో వస్తుంది..ఇప్పుడిదే ప్రశ్న రేగుతోంది. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అనుమతి కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇండియా ఎప్పుడు ఈ వ్యాక్సిన్‌ను ఆమోదిస్తుందో తెలుసా..

Last Updated : Dec 11, 2020, 03:08 PM IST
  • ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇండియా అనుమతి కోరిన సీరమ్ ఇనిస్టిట్యూట్
  • క్రిస్మస్ నాటికి ఆమోదం లభించే అవకాశం..
  • యూకే రెగ్యులేటరీ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న భారత్
Oxford vaccine in india: ఇండియాలో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలుసా..

Oxford vaccine in india : ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో వస్తుంది..ఇప్పుడిదే ప్రశ్న రేగుతోంది. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ అనుమతి కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇండియా ఎప్పుడు ఈ వ్యాక్సిన్‌ను ఆమోదిస్తుందో తెలుసా..

ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఫైజర్ వ్యాక్సిన్‌ ( Pfizer vaccine )కు యూకే రెగ్యులేటరీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ వారంలో యూకేలో వ్యాక్సినేషన్ ( vaccination ) కూడా ప్రారంభం కానుంది. అదే సమయంలో అదే దేశానికి చెందిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ( Oxford-Astrazeneca ) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ఆమోదం కోసం యూకే రెగ్యులేటరీ ( Uk regulatory ) పరిశీలిస్తోంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి యూకే, బ్రెెజిల్ దేశాల్లో జరుగుతున్న ట్రయల్స్ ఆధారంగా అనుమతి ఉంటుంది. మరోవైపు ఇదే వ్యాక్సిన్‌ను దేశీయంగా ఉత్పత్తి చేసి, పంపిణీ చేసే ఒప్పందాన్ని కుదుర్చుకున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum institute ) ఇండియాలో ఆమోదం కోసం భారతదేశ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. యూకే డ్రగ్ రెగ్యులేటరీ తమ దేశంలో ఇంకా ఆమోదం తెలుపనందున ఈ అంశం ఇండియాలో కూడా పెండింగ్‌లో ఉంది. యూకే డ్రగ్ రెగ్యులేటరీ ఆమోదం లభించిన వెంటనే...ఇండియా కూడా ఆమోదించే అవకాశాలున్నాయి. ఈ నేపధ్యంలో క్రిస్మస్ నాటికి ఇండియాలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఉత్పత్తికి సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు అనుమతి లభించవచ్చని తెలుస్తోంది. 

యూకే, బ్రెజిల్ దేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ ( Vaccine trials ), ఆమోదం అంశాల్ని ఇండియా ప్రాతిపదికగా తీసుకుంటోంది. మరోవైపు మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ( MHRA ) ఈ వ్యాక్సిన్ ఫలితాల్ని , సామర్ధ్యాన్ని, మోతాదును అంచనా వేస్తోంది. వ్యాక్సిన్ ఆమోదమనేది చాలా సున్నితమైన అంశమని..వ్యాక్సిన్ భద్రత, సామర్ధ్యం, రోగ నిరోధక శక్తిపై కచ్చితంగా సమాచారం లభిస్తేనే అనుమతి ఇవ్వగలమని ఓ అధికారి తెలిపారు. ఇందులో భాగంగా వ్యాక్సిన్ 2,3 దశల మానవ క్లినికల్ ట్రయల్స్ అప్‌డేటెడ్ డేటాతో పాటు..యూకే ట్రయల్ ఇమ్యునోజెనిసిటీ డేటాను కూడా సమర్పించాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ను కోరింది ప్రభుత్వం. ఇండియాలో అత్యవసర వినియోగ ప్రామాణీకరణ ఆమోదం పొందాలంటే..ఎంహెచ్ఆర్ఏకు వివరాలు తప్పనిసరిగా అందించాలని ప్రభుత్వ ప్యానెల్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ కోరింది. Also read: UPA చైర్మన్‌గా శరద్ పవార్‌ను నియమిస్తే మద్దతిస్తాం: శివసేన

Trending News