ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. ఫైజర్ బయోన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్‌ను యూకే ఆమోదించింది. ఎంహెచ్ఆర్ఏ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ కు ఆమోదముద్ర వేసింది బ్రిటన్ ప్రభుత్వం.
First Covid-19 Vaccine got approval: ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. ఫైజర్ బయోన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్‌ను యూకే ఆమోదించింది. ఎంహెచ్ఆర్ఏ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ కు ఆమోదముద్ర వేసింది బ్రిటన్ ప్రభుత్వం.
యూకే ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్‌కు ఆమోదముద్ర వేయడంతో వచ్చే వారానికి యూకేలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ఫైజర్ తెలిపింది. కోవిడ్ వైరస్ పై పోరులో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని కంపెనీ పేర్కొంది.
మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ( MHRA ) ప్రకారం ఈ వ్యాక్సిన్ 95 శాతం రక్షిస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను జర్మనీకు చెందిన బయోన్టెక్, అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీలు కలిసి అభివృద్ధి చేశాయి. అన్ని వయస్సులు, జాతులు, ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని ఇటీవలే ఫైజర్-బయోన్టెక్ సంస్థ ప్రకటించింది.