2022 సంవత్సరానికి గాను భారతదేశంలో జరిగే జాతీయ క్రీడలకు మేఘాలయ రాష్ట్రం వేదిక కానుంది. దీనికి సంబంధించిన కాంట్రాక్టుపై ఈ రోజు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతాతో పాటు మేఘాలయ ఒలింపిక్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాన్ క్రాషింగ్ సంతకం చేశారు. ఈ కాంట్రాక్టుపై సంతకం చేశాక మేఘాలయ ఆర్ట్ అండ్ కల్చరల్ మంత్రి ఆర్ వి లిండాంగ్ బిడ్ సొమ్ము క్రింద 4.5 కోట్ల రూపాయలను ఐఓఏకు చెల్లించారు.
ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయాలను కూడా దేశం మొత్తం తెలియజేయడం కోసం.. ఈసారి వాటిల్లో ఒక్కటైన మేఘాలయకు అవకాశం కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మెహతా అన్నారు. జాతీయ క్రీడలు ఈశాన్య రాష్ట్రాల్లో నిర్వహించడం కొత్తేమీ కాదు. 1999లో తొలిసారిగా మణిపూర్‌లో నిర్వహించారు. అలాగే 2007లో అసోం రాష్ట్రంలో నిర్వహించారు. చిత్రమేంటంటే.. 2022లోనే మేఘాలయ తన 50వ రాష్ట్ర మహోత్సవాలు జరుపుకోవడం గమనార్హం.
2022 జాతీయ క్రీడలకు వేదిక 'మేఘాలయ'