Love Jihad: ఆ హిందీ సినిమాల్లో ఉన్నది లవ్ జిహాద్ కాదా?

  • Nov 18, 2020, 16:42 PM IST

లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు చట్టాలు చేసేందుకు సిద్ధమౌతున్నాయి. ఈ క్రమంలో కొన్ని హిందీ సినిమాలు చర్చనీయాంశమవుతున్నాయి. మతం గోడల్ని కాదని..ప్రేమను ఎక్కువగా చూపిస్తూ నిర్మించే చిత్రాలు  బాలీవుడ్ లో ఎక్కువే ఉన్నాయి. అందుకే ఇప్పుడా సినిమాలపై చర్చ సాగుతోంది. అందులో కొన్ని మీ కోసం..

1 /4

కరణ్ జోహార్ నిర్మించిన మై నేమ్ ఈజ్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మత ఛాందసవాదాన్ని చూపిస్తుంది. సినిమాలో షారుఖ్ ఖాన్ ముస్లిం యువకుడిగా..హిందూ యువతి కాజోల్ ప్రేమలో పడతాడు.  

2 /4

సోనాలీ బింద్రే, అక్షయ్ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో 1999లో విడుదలైన దహక్ సినిమా...అప్పట్లో ఓ సంచలనమే. ఈ సినిమాలో హిందూ, ముస్లిం యువతీ యువకుల మద్య సంబంధాన్ని చూపించారు. సోనాలీ బింద్రే ఇందులో డబుల్ రోల్ లో కన్పిస్తుంది.   

3 /4

అభిషేక్ కపూర్ దర్శకత్వంలో విడుదలైన కేదార్ నాధ్ సినిమా...ఇద్దరు యువతీ యువకుల ప్రేమ ఆధారంగా తీసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముస్లిం యువకుడిగా..సారా అలీఖాన్ హిందూ పర్యాటకురాలిగా నటించిన సినిమా ఇది. ఈ సినిమాను హిందూ సంస్థలు వ్యతిరేకించాయి.  

4 /4

మణిరత్నం దర్శకత్వంలో 1995లో విడుదలైన బాంబో సినిమా అప్పట్లో ఓ సంచలనం. రెండు మతాలకు చెందిన యువతీ యువకుల మధ్య చిగురించిన ప్రేమకు దర్పణమిది.ఏఆర్ రెహమాన్ సంగీతంలో..అరవింద్ స్వామి, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రల్లో  నటించిన చిత్రం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.