Coronavirus Updates in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు పెరుగుతునే ఉన్నాయి. కొన్నిరోజుల నుంచి వేయికి చేరువలో నమోదవుతున్న కేసులు కాస్త.. శనివారం, ఆదివారం భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా 500 కేసులే నమోదయ్యాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య తాజాగా మూడురెట్లు పెరిగింది. గత 24 గంటల్లో ( నవంబరు 15న ) రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,57,876 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,407 కి చేరింది.
అయితే గత 24 గంటల్లో కరోనా నుంచి 1,539 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,42,084 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 14,385 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 93.87 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: Sabarimala: నేటినుంచి దర్శనమివ్వనున్న అయ్యప్ప స్వామి
ఇదిలావుంటే.. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా 17,296 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 15వ తేదీ వరకు మొత్తం 48,91,729 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ పరిధిలో 141 కేసులు నమోదయ్యాయి. అయితే.. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..