TRT Result 2020: టీఆర్‌టీ ఫలితాలు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

TRT Result 2020  |   TSPSC   టీచ‌ర్స్ రిక్రూర్‌మెంట్ టెస్ట్‌ (TRT) కింద నోటిఫై చేసిన 31,048 పోస్టుల నియామ‌కాల‌లో మరో అడుగు పడింది. 325 పోస్టుల ఫలితాలను తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (TSPSC) గురువారం (అక్టోబరు 22న)  విడుదల చేసింది.

Last Updated : Oct 23, 2020, 09:29 AM IST
TRT Result 2020: టీఆర్‌టీ ఫలితాలు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

తెలంగాణలో టీచ‌ర్స్ రిక్రూర్‌మెంట్ టెస్ట్‌ (TRT) కింద నోటిఫై చేసిన 31,048 పోస్టుల నియామ‌కాల‌లో మరో అడుగు పడింది. 325 పోస్టుల ఫలితాలను తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (TSPSC) గురువారం (అక్టోబరు 22న)  విడుదల చేసింది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ (డీఎంఈ) కింద 167 అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులకు, 158 స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పోస్టులకు సంబంధించిన ఫలితాలు ప్రకటించారు.

అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా మూడు పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయని వెల్లడించింది. కోర్టు కేసుల కారణంగా రెండు పోస్టుల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్ రిపోర్టుల అనంతరం ఫిజికల్ హ్యాండిక్యాప్ (పీహెచ్) ఐదు పోస్టుల ఫలితాలు టీఎస్‌పీఎస్సీ వెల్లడించనుంది. 

అధికారిక వెబ్‌సైట్

 

కాగా, స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పోస్టులకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ త్వరలో ఉంటుంది. పలు తేదీలలో ఆరు ద‌శ‌ల్లో వెరిఫికేషన్ చేయనున్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. కొన్ని కారణాలతో 158 పోస్టులకుగానూ 148 పోస్టులను మాత్రమే ప్రస్తుతానికి భర్తీ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News