French Open 2020 Winner: స్వైటక్.. 19 ఏళ్లకే మట్టి కోర్టులో రారాణి

ఒక్క సెట్టూ కోల్పోకుండా ఏకంగా తన తొలి గ్రాండ్‌స్లామ్ (French Open 2020) ‌ను గ్రాండ్‌గా నెగ్గింది పోలాండ్ ప్లేయర్ స్వైటక్. పొలాండ్‌కు చెందిన 19 ఏళ్ల టీనేజ్ సంచలనం ఐగ స్వైటక్ ఫ్రెంచ్ ఓపెన్ విజేత (French Open 2020 Winner Female)గా నిలిచింది.

Last Updated : Oct 11, 2020, 09:13 AM IST
French Open 2020 Winner: స్వైటక్.. 19 ఏళ్లకే మట్టి కోర్టులో రారాణి

ఫ్రెంచ్ ఓపెన్ (French Open 2020) గ్రాండ్‌స్లామ్‌లో అద్భుతం జరిగింది. పొలాండ్‌కు చెందిన 19 ఏళ్ల టీనేజ్ సంచలనం ఐగ స్వైటక్ ఫ్రెంచ్ ఓపెన్ విజేత (French Open 2020 Winner Female)గా నిలిచింది. 28 ఏళ్ల తర్వాత అతిపిన్న వయసులో మట్టికోర్టు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన క్రీడాకారిణిగా స్వైటక్ (Iga Swiatek) అరుదైన ఘనత సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో 6-4, 6-1 తేడాతో అమెరికా క్రీడాకారిణి సోఫియా కెనిన్‌పై అలవోకగా గెలుపొంది కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ కైవసం చేసుకుంది.

మహిళల సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి పోలాండ్ క్రీడాకారిణిగా అరుదైన రికార్డును స్వైటక్ తన పేరిట లిఖించుకుంది. ఈ క్రమంలో 2018 విజేత సిమోనా హలెప్, 2019 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ వాండ్రౌసోవాలను చిత్తు చేయడం గమనార్హం. ఇప్పటివరకూ 7 గ్రాండ్‌స్లామ్‌లు ఆడినా ఒక్కసారి కూడా 4వ రౌండ్ దాటని స్వైటక్ ఏకంగా ఫ్రెంచ్ ఓపెన్ 2020 విజేతగా నిలవడాన్ని నమ్మలేకపోతున్నా అంటోంది పోలాండ్ బ్యూటీ స్వైటక్. 

కాగా, 2005లో స్పెయిన్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్ తర్వాత ఫ్రెండ్ ఓపెన్ విజేతగా అవతరించిన అతిపిన్న వయస్కురాలిగా స్వైటక్ నిలిచింది. 2007లో జస్టిస్ హెనిన్ తర్వాత ఒక్క సెట్టూ కోల్పోకుండా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన క్రీడాకారిణి స్వైటక్. దిగ్గజ ప్లేయర్స్‌తో మ్యాచ్‌లలో సైతం కనీసం ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరిన తొలి ప్రయత్నంలోనే గ్లాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Also Read : CSK loss to KKR: ఐపీఎల్ చరిత్రలో చెన్నై అలా ఓడటం తొలిసారి.. రికార్డులకు బ్రేక్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News