UP govt gives 10-day extension to SIT: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో 19 ఏళ్ల యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యోగి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (( CM Yogi Adityanath) ) మొదట సిట్ (SIT) ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణను సీబీఐ (CBI) కూడా అప్పగించారు. అయితే ప్రభుత్వం నిర్థేశించిన సమయం ప్రకారం బుధవారంతో సిట్ దర్యాప్తు ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో సిట్ కాల పరిమితి గడువును మరో పది రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూపీ ప్రభుత్వ హోం శాఖ కార్యదర్శి అవనిష్ కె అవస్థీ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ఈ దారుణ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేసి, నివేదికను సమర్పించేందుకు గడుడును పెంచాలన్న సిట్ సభ్యుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. Also read: Hathras Case: అందుకే అర్థరాత్రి అంత్యక్రియలు: యూపీ ప్రభుత్వం
ఇదిలాఉంటే.. హత్రాస్ కేసుకు సంబంధించిన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం విచారించింది. ఇది అత్యంత దారుణమైన, భయంకరమైన సంఘటన అంటూ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది. అయితే ఈ కేసులో సాక్షులను ఎలా రక్షిస్తున్నారు.. అదేవిధంగా ఈ సంఘటన తర్వాత చర్యలపై అక్టోబర్ 8 లోగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. Also read: Hathras Gang Rape Case: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
సెప్టెంబరు 14న పొలం పని చేస్తున్న 19 ఏళ్ల దళిత యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, నాలుక కోసి, చిత్రహింసలకు గురిచేశారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడుతూ.. ఢిల్లీలోని సప్దర్జంగ్ ఆసుపత్రిలో సెప్టెంబరు 29న కన్నుమూసింది. అయితే బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పకుండా, వారిని అనుమతించకుండానే అదేరోజు అర్థరాత్రి 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. ఆతరువా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వం హత్రాస్ ఎస్పీతో సహా ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. Also read: Hathras incident: ఎస్పీ సహా ఐదుగురు పోలీసులపై వేటు