కోలీవుడ్‌లో "విజయ్ దేవరకొండ" ఎంట్రీ

పెళ్లిచూపులు, ద్వారక, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యువ హీరో విజయ్‌ దేవరకొండ. 

Last Updated : Dec 24, 2017, 06:29 PM IST
కోలీవుడ్‌లో "విజయ్ దేవరకొండ" ఎంట్రీ

పెళ్లిచూపులు, ద్వారక, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యువ హీరో విజయ్‌ దేవరకొండ. అనతికాలంలోనే యువతలో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు కోలీవుడ్‌లో కూడా తన లక్ పరీక్షించుకోనున్నారు. తమిళ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ ఇప్పటికే విజయ్‌ను హీరోగా అనుకొని ఓ స్క్రిప్ట్ రెడీ చేయగా.. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఆ ప్రకటనలో విజయ్‌ దేవరకొండను సౌత్‌ సెన్సేషన్‌‌గా పేర్కొన్నారు. ఇంకా ఈ సినిమాకు టైటిల్‌ పెట్టలేదు. ఆనంద్‌ శంకర్‌ గతంలో జాతీయ అవార్డు గ్రహీత హీరో విక్రమ్‌ నటించిన ‘ఇరుముగన్‌’ (తెలుగులో ‘ఇంకొక్కడు’) చిత్రానికి దర్శకత్వం వహించారు. 

Trending News