ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా గురువారం రాత్రి జరిగిన 6వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bengaluru)పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (Kings XI Punjab) 97 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (132; 69 బంతుల్లో 14ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ శతకం సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో KXIP కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ఐపీఎల్లో వేగంగా 2వేల పరుగుల మార్కు చేరిన భారత క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. రాహుల్ తన 60వ ఇన్నింగ్స్‌లో భాగంగా ఐపీఎల్లో 2 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. ఓవరాల్‌గా చూస్తే క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు. గేల్ తన 48వ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ (KXIP) జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (132) అద్భుత శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ సేన (RCB) 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 97 పరుగుల భారీ ఓటమిని మూటగట్టుకుంది.
ఫొటో గ్యాలరీలు
-
నటి అన్వేషి జైన్ బ్యూటిఫుల్ ఫొటోస్
-
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
- Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe