Cricket South Africa: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు

South Africa Govt Suspends CSA | ఏడాది కాలం నుంచి జట్టు ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ జాతీయ జట్టును ఆ దేశ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మరోసారి సంక్షోభంలో పడింది.

Last Updated : Sep 11, 2020, 12:31 PM IST
  • మరోసారి సంక్షోభంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (South Africa Cricket)
  • దక్షిణాఫ్రికా క్రికెట్ జాతీయ బోర్డును ఆ దేశ ప్రభుత్వం సస్పెండ్
  • బోర్డు అధికారులు పదవుల నుంచి తప్పుకోవాలని సైతం సూచించింది
Cricket South Africa: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (South Africa Cricket) మరోసారి సంక్షోభంలో పడింది. దక్షిణాఫ్రికా క్రికెట్ జాతీయ బోర్డును ఆ దేశ ప్రభుత్వం సస్పెండ్ (South Africa Govt Suspends CSA) చేసింది. ఏడాది కాలం నుంచి జట్టు ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు వస్తున్నాయి. జట్టు ప్రదర్శన సైతం సాధారణంగా ఉన్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ బోర్డు వ్యవహారాలను దేశ ప్రభుత్వమే చూసుకుంటుందని, ప్రస్తుతం ఉన్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారులు పదవుల నుంచి తప్పుకోవాలని సైతం సూచించింది. Chalamalasetty Ramanjaneyulu: కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి

క్రికెట్ కచ్చితంగా ఓ బోర్డు ఆధ్వర్వంలో వ్యవహారాలు చక్కబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పైగా అన్ని క్రికెట్ ఆడే జాతీయ జట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఉంటాయి కనుక దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ప్రత్యేక అనుమతులు ఉండవు. త్వరలోనే ఐసీసీ ఈ విషయంలో జోక్యం చేసుకోనుంది. కాగా, గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా జట్టు పేలవ ప్రదర్శనతో ఆ దేశ క్రికెట్ ప్రేమికులను తీవ్రంగా నిరాశ పరిచింది. 9 మ్యాచ్‌లాడిన ఆ జట్టు కేవలం మూడింట్లో గెలిచి లీగ్ దశను కూడా దాటలేక ఇంటి దారి పట్టడం తెలిసిందే. Harbhajan Singh: చెన్నై పోలీసులను ఆశ్రయించిన హర్భజన్ సింగ్ 

అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్రతి దేశానికి ప్రత్యేకమైన క్రికెట్ బోర్డు ఉంటుంది. భారత్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఉంది. ఇవి ఖచ్చితంగా ఐసీసీ ఆధ్వర్యంలోని ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో మ్యాచ్‌ల షెడ్యూల్, టోర్నీలు లాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ ఆయా దేశాల ప్రభుత్వాలు క్రికెట్ బోర్డులను ఆధీనంలోకి తీసుకుంటే ఐసీసీ వాటిని నిషేధిస్తుంది. గతంలో నేపాల్, జింబాబ్వే దేశ ప్రభుత్వాలు జాతీయ క్రికెట్‌ను తమ ఆధీనంలోకి తీసుకోగానే ఐసీసీ వాటిపై నిషేధం విధించింది. ఆ దేశాలు వెనక్కి తగ్గి క్రికెట్ బోర్డులకు పగ్గాలు అప్పగించగా నిషేధాన్ని ఎత్తివేయడం తెలిసిందే. Rishabh Pant: ధోనీని ఫాలో కావొద్దు.. రిషభ్ పంత్‌కు ఎమ్మెస్కే ప్రసాద్ వార్నింగ్

ఫొటో గ్యాలరీస్:

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News