Telangana EAMCET entrance exams started: హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఎంసెట్ 2020 (EAMCET) ప్రవేశ పరీక్షలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నేపథ్యంలో అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు థర్మల్ స్కానింగ్ చేసి అధికారులు లోపలికి అనుమతిస్తున్నారు. విద్యార్థులు మాస్కులు ధరించేలా.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. Also read: TSCETS 2020: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..
అయితే ఎంసెట్ ఇంజనీరింగ పరీక్షలు 9,10,11,14 తేదీల్లో రెండు విభాగాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు.. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండు విభాగాల్లో పరీక్షలను ఆన్‌లైన్ పద్దతిన నిర్వహించనున్నారు. ఈ ఎంసెట్ పరీక్షల కోసం జేఎన్‌టీయూ తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్‌లో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. Also read: Covid-19: తెలంగాణలో తాజాగా 2,479 కరోనా కేసులు
TS EAMCET-2020: కోవిడ్ నిబంధనలతో.. ప్రారంభమైన ఎంసెట్ పరీక్షలు