ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu ) నమ్రతా తమ కుటుంబంలోని చిన్ని చిన్ని సంతోషాలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఫ్యాన్స్ కూడా వారు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ( Viral Video) చూసి సంతోషడుతుంటారు. తాజాగా అలాంటిదే ఒక పాత వీడియో సోషల్ మీడియాలో ( Social Media ) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేష్ కుమార్తె సితార ( Sitara ) వినాయకుడి శ్లోకం పాడుతుంది.
మహారాష్ట్రలో ఎక్కువగా ఆ పాటను వినాయకుడి హారతి (aarati ) సమయంలో పాడుతుంటారు. జయదేవ జయదేవ అంటూ సాగే ఈ శ్లోకాన్ని మహేష్ సతీమని నమ్రత... సితారకు నేర్పించింది అనేది మాత్రం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు. మీరు కూడా వినండి.
సితారా ఈ పాటను పాడుతున్న సమయంలో మహేష్ బాబు కుమారుడు గౌతమ్ పుస్తకం చదువుతూ కనిపించాడు. సితారా శ్లోకం పాడటాన్ని వింటూనే మధ్యమధ్యలో కెమెరావైపు చూస్తూ కనిపించాడు గౌతం. ఈ వీడియో పాతది అని తెలుస్తోంది. అయినా కానీ అభిమానులను అలరిస్తోంది.
జయదేవ జయదేవ జయమంగళమూర్తి అంటూ ఎంతో చక్కగా వినాయకుడి శ్లోకం పాడిన @urstrulyMahesh కుమార్తె సితార ఘట్టమనేని#NamrataShirodkar shares this throwback video of #SitaraGhattamaneni reciting Ganapati Aarti in Marathi #MaheshBabu #SarkaruVaariPaata. pic.twitter.com/sodlqz4ckD
— ZEE HINDUSTAN తెలుగు (@ZeeHTelugu) September 7, 2020