World Coconut Day: సర్వగుణ సంపన్నమైన కొబ్బరి నీరు

ఎండాకాలంలో కొబ్బరి నీరు ( Coconut Water ) వినియోగం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎండాకాలం, చలికాలం అని చూడకుండా ఏ సీజన్ లో అయినా కొబ్బరి నీరు తాగవచ్చు. 

Last Updated : Sep 2, 2020, 05:35 PM IST
    • ఎండాకాలంలో కొబ్బరి నీరు వినియోగం ఎక్కువగా ఉంటుంది.
    • కానీ ఎండాకాలం, చలికాలం అని చూడకుండా ఏ సీజన్ లో అయినా కొబ్బరి నీరు తాగవచ్చు. ఎందుకంటే కొబ్బరి నీరు సర్వగుణ సంపన్నమైనవి.
    • రోజుకు సరిపడా శక్తి మీకు కొబ్బరి నీటి వల్ల లభిస్తుంది.
World Coconut Day: సర్వగుణ సంపన్నమైన కొబ్బరి నీరు

ఎండాకాలంలో కొబ్బరి నీరు ( Coconut Water ) వినియోగం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎండాకాలం, చలికాలం అని చూడకుండా ఏ సీజన్ లో అయినా కొబ్బరి నీరు తాగవచ్చు. ఎందుకంటే కొబ్బరి నీరు సర్వగుణ సంపన్నమైనవి. రోజుకు సరిపడా శక్తి మీకు కొబ్బరి నీటి వల్ల లభిస్తుంది. డీహైడ్రేషన్ నుంచి కాపాడటమే కాడదు..సౌందర్యానికి  కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి ( Health )  చాలా మంచిది.

ఒక కొబ్బరి బోండంలో కనీసం 200 మిల్లీ లీటర్లు లేదా అంతకన్నా ఎక్కవ నీరు ఉటుంది. ఇది లో క్యాలరీ డ్రింక్ కూడా.. కొబ్బరి నీటిలో యాంటి ఆక్సిడెంట్, ఆమీనో యాసిడ్, ఎంజైమ్స్, బీ కాంప్లెక్స్ విటమిన్, విటామిన్ సీ గుణాలు ఉంటాయి. కార్బోహైడ్రైట్స్ కు మంచి సోర్స్ ఇది.  శక్తిని పెంచుతుంది. ఇలాంటి మరిన్ని లాభాలు ఇవే...

డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది కొబ్బరి నీరు ( Coconut Water for Dehydration )
కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉదర సంబంధిత రోగాలను నివారిస్తుంది. కొబ్బరినీటిలో నిమ్మకాయ రసం కలిపి తాగడం వల్ల డీహైడ్రేషన్ తొలగుతుంది.

బరువు తగ్గడానికి  ( Coconut Water for Weight Reduction)
ఉదయం వర్కవుట్ తరువాత కొబ్బరి నీరు తాగడం మంచిది. ఇందులో చాలా తక్కువ శాతం కేలరీస్ ఉంటాయి. బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో బయో యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను పెంచుతాయి. కొబ్బరి నీటి వల్ల పొట్ట నిండుగా మారుతుంది. ఆకలి తక్కువగా వేస్తుంది.

హై బీపి అదుపులోకి వస్తుంది  ( Coconut Water for High BP )
కొబ్బరి నీరు తాగడం వల్ల హైబీపి అదుపులోకి వస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సీ, పోటాషియం, మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ ను అదుపు చేస్తుంది. దాంతో పాటు హైపర్ టెన్షన్ ను కూడా కంట్రోల్ చేస్తుంది.

తలనొప్పి తగ్గిస్తుంది  ( Coconut Water for Head Ache )
బాగా తలనొప్పిగా ఉన్నా.. లేదా మైగ్రేయిన్ ఉన్నా కొబ్బరి నీరు తాగండి. ఎందుకంటే డీ హైడ్రేషన్ వల్ల తలనొప్పి వస్తుంది.  కొబ్బరి నీటి వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇందులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. చాలా మందిలో మెగ్నీషియం లోపించడం వల్లే తలనొప్పి మైగ్రేషన్ వస్తుంది. కొబ్బరి నీటితో మెగ్నీషియం శరీరానికి చేరుతుంది.

హ్యాంగోవర్ నుంచి విముక్తి  ( Coconut Water for Hangover)
హ్యాంగోవర్ తగ్గాలంటే కొబ్బరి నీళ్లు తాగండి. 

 

Trending News