న్యూ ఢిల్లీ: కరడుగట్టిన కాంగ్రెస్ వాదే అయినప్పటికీ.. ఒకానొక సందర్భంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ( Pranab Mukherjee ) ప్రవర్తనపై సొంత పార్టీనే కస్సుబుస్సులాడింది. తప్పు చేస్తున్నావు దాదా అంటూ పలువులు కాంగ్రెస్ పార్టీ ( Congress leaders ) నేతలు ఆ పెద్దాయనకే హితవు పలికారు. ఇంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీకే సేవ చేసిన ఈ పెద్దాయన ఈ వయస్సులో ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ కామెంట్ చేసిన వాళ్లూ లేకపోలేదు. కానీ వాటన్నింటికీ పట్టించుకోని ప్రణబ్ ముఖర్జీ మాత్రం తనకు తోచిందే చేశారు. అదేంటో కాదు... 2018లో జూన్ 7న నాగపూర్లో జరిగిన ఆర్ఆర్ఎస్ సమావేశానికి ( RSS meeting ) హాజరవడమే. అవును, బీజేపికి అనుబంధ సంస్థ అనే పేరున్న ఆర్ఎస్ఎస్ ( RSS ) వాళ్లు అతిథిగా ఆహ్వానిస్తే వెళ్లడం ఏంటంటూ ప్రణబ్ దాదాపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వ్యక్తమయ్యాయి. Also read : BREAKING: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
ప్రణబ్ ముఖర్జి జీవితంలో ( Pranab Mukherjee life ) రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనియాంశమైంది. కానీ ఆర్ఎస్ఎస్ సమావేశానికి అతిథిగా వెళ్లిన ప్రణబ్ ముఖర్జీ అక్కడ సభావేదికపై మాట్లాడిన తీరు చూశాకా మాత్రం.. ఆయన్ని విమర్శించి వాళ్లందరి నోర్లు మూతపడ్డాయి. కారణం లేనిదే దాదా ఏదీ చేయరనే నిర్ణయానికొచ్చాయి. Also read : Pranab Mukherjee childhood: అప్పుడు రోజూ 10 కి.మీ నడిచిన ప్రణబ్
ప్రణబ్ ముఖర్జి మృతి ( Pranab Mukherjee's death )నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ( RSS chief Mohan Bhagwat ) ఆయన్ను స్మరించుకుంటూ దాదాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ( RSS event ) ప్రణబ్ హాజరై మాట్లాడినప్పటి సందర్భాన్ని మోహన్ భగవత్ ( Mohan Bhagwat ) గుర్తుచేసుకుంటూ.. ఆయన మాజీ రాష్ట్రపతి అయ్యుండి కూడా అత్యంత సాధారణ మనిషిగా ఉండే వారని అన్నారు. ఒకవిధంగా ప్రణబ్ ముఖర్జీ మృతి ఆర్ఎస్ఎస్కి తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రణబ్ మంచి మేధావి, దేశానికే తప్ప దేనికీ తలవంచని వ్యక్తిత్వం ఆయనది అని మోహన్ భగవత్ కొనియాడారు. Also read : ప్రణబ్ ముఖర్జీ జీవితంలోని అరుదైన ఫోటోలు