కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపాలపై, అధ్యక్ష ఎన్నిక జరగకపోవడం వల్ల తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ (Gulam Nabi Azad) అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Congress Working Committee) లో సభ్యుడిగా ఎన్నికైతే వారిని తొలగించకూడదని, దానివల్ల వచ్చే సమస్య ఏంటని ప్రశ్నించారు. అంతర్గతంగా పార్టీలో ఎన్నికల ద్వారా ఎన్నికైన వ్యక్తికి పరిపూర్ణ మద్దతు ఉంటుందని, ఎన్నికల్లోనూ అలాంటి వ్యక్తి విజయాలు సాధించేందుకు అవకావం ఉంటుందన్నారు. ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు షేర్ చేసుకున్నారు. Telangana: భారీగా పెరిన కరోనా కేసులు
‘కేంద్రం, రాష్ట్ర స్థాయిలో పార్టీలోనూ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలి. పార్టీ నేతల మద్దతు ఉన్న వ్యక్తి అధ్యక్షులుగా కొనసాగుతారు. దీనివల్ల ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కష్టమే. మరో 50ఏళ్లపాటు ప్రతిపక్షంలోనే కొనసాగుతుంది. జిల్లా అధ్యక్షుల విషయంలోనూ పార్టీ నేతలు ఎన్నుకున్న వ్యక్తులకే బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయం. Gold Price: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
పార్టీలోనే మద్దతు లేని వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తే ఎన్నికల్లో గెలవడం అసాధ్యం. అలాంటి వ్యక్తులకు ఒక శాతం మద్దుతు ఉంటుందా... లేక వంద శాతం మద్దుతు దొరుకుతుందా చెప్పడం కష్టమే. అందుకే హైకమాండ్ నిర్ణయించిన వ్యక్తి అయితే ఏ సమయంలోనైనా పదవి నుంచి తొలగిస్తారు. అదే పార్టీ నేతల ద్వారా ఎన్నికైతే అలాంటి సందర్భం రాదని’ కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ కమిటీ సమావేశం జరిగిన మూడు రోజుల అనంతరం ఆజాద్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. Engagement Photos: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎంగేజ్మెంట్ ఫోటోలు
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు
Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్