సంగారెడ్డి : శ్రీశైలం పవర్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదం దుర్ఘటన ఇంకా మరువక ముందే తాజాగా సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగులో సాల్వెంట్ గోడౌన్లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం ( Major fire accident ) చోటుచేసుకుంది. మంటలు గోడౌన్ నలువైపులా వ్యాపించడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుమ్మడిదల ప్రాంతంలో ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీలే ఉండటంతో ఈ ప్రమాదం అక్కడి వారిలో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. Also read : Interesting facts: వినాయక చవితి కథలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు
తెలంగాణ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం..
డ్రమ్ముల గోదాంలో భారీగా ఎగసిపడుతోన్న మంటలు#SangaReddy #Telangana #FireAccident pic.twitter.com/zzfMB7PTwO
— ZEE HINDUSTAN తెలుగు (@ZeeHTelugu) August 22, 2020
సాల్వెంట్స్ గోడౌన్లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ( Short circuit ) కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. అసలు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Also read : Jr NTR remuneration: ఎన్టీఆర్ పారితోషికం తిరిగిచ్చేశారా ?