22 ఏళ్లుగా మీరు ప్రజలకేం చేశారు? : రాహుల్

 ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర విమానంలో ప్రయాణించడం బాగానే ఉంది.. కానీ అది పక్కదోవ పట్టించడమేనని ఎద్దేవా చేశారు.

Last Updated : Dec 12, 2017, 08:50 PM IST
22 ఏళ్లుగా మీరు ప్రజలకేం చేశారు? : రాహుల్

అహ్మదాబాద్ (గుజరాత్): కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ సముద్ర విమానంలో ప్రయాణించడంపై చురకలంటించారు. ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర విమానంలో ప్రయాణించడం బాగానే ఉంది.. కానీ అది ఒక పరధ్యానం (పక్కదోవ పట్టించడం) అని గుర్తించుకోవాలన్నారు.

అహ్మదాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో- "ప్రధాని మోదీ సముద్ర విమానంలో ప్రయాణించడం తప్పుకాదు.. చాలా మంచిది. కానీ అదొక పరధ్యానం మాత్రమే. అసలైన ప్రశ్న ఇది: 22 ఏళ్లు మీరు ప్రజలకేం చేశారు" అని అన్నారు. ప్రధానమంత్రి మోదీ అహ్మదాబాద్ లో సబర్మతి నది నుండి సముద్ర విమానంలో ధరోయ్ డ్యాంకు ప్రయాణించిన తరువాత రాహుల్ ఈ ప్రశ్నను సంధించారు.

గుజరాత్ లో రెండో దఫా ఎన్నికలు అహ్మదాబాద్ తో సహా మిగిలిన ప్రాంతాల్లో డిసెంబర్ 14వ తేదీ జరుగుతాయి. నేడే చివరి ఎన్నికల ప్రచారం. తొలి దశ పోలింగ్ డిసెంబరు 9 న జరిగింది. 68 శాతం ఓటింగ్ నమోదైంది. డిసెంబరు 18న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పాలద్రోలాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గతంలో గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 17, 1994 నుండి మార్చి 13,1995 వరకు అధికారంలో ఉంది.

Trending News