Sushant Death: ఫిబ్రవరి 25 ఫిర్యాదుపై చర్యలేవి ?

బాలీవుడ్ నటుడు ( Bollywood ) , ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై  విభిన్న రకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సుశాంత్ తండ్రి ( Sushant Father ) విడుదల చేసిన వీడియోతో సుశాంత్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది.

Last Updated : Aug 3, 2020, 07:10 PM IST
Sushant Death: ఫిబ్రవరి 25 ఫిర్యాదుపై చర్యలేవి ?

బాలీవుడ్ నటుడు ( Bollywood ) , ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై  విభిన్న రకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సుశాంత్ తండ్రి ( Sushant Father ) విడుదల చేసిన వీడియోతో సుశాంత్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది.

ఇటీవల సుశాంత్ సింహ్ రాజ్ పుత్ మరణం ( Sushant singh rajput death ) వెనుక అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ( Rhea Chakravarthy ) ప్రమేయముందంటూ సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయడం సంచలనమైంది. అప్పట్నించి రియా చక్రవర్తి అందుబాటులో లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్ని ఖండిస్తూ ముంబై పోలీసులు ( Mumbai police ) ఓ ప్రకటన చేశారు. రియా చక్రవర్తి గతంలో నాలుగుసార్లు పిలిచిన వెంటనే విచారణకు హాజరవడమే కాకుండా...సహకరించిందని పోలీసులు చెప్పారు. ఇప్పుడు సుశాంత్ తండ్రి మరో వీడియో విడుదల చేస్తూ...పాట్నాలో ఎఫ్ ఐ ఆర్ ఎందుకు రిజిస్టర్ చేయాల్సివచ్చిందో  వివరణ ఇచ్చారు. ఇదే ఇప్పుడు సుశాంత్ మరణాన్ని మరోసారి చర్చనీయాంశం చేస్తోంది. ఫిబ్రవరి 25న తన కుమారుడు ప్రమాదంలో ఉన్నాడంటూ బాంద్రా పోలీసులకు ( Bandra Police ) ఫిర్యాదు చేశానని సుశాంత్ తండ్రి వీడియోలో స్పష్టం చేశారు. జూన్ 14న తన కుమారుడు చనిపోయిన తరువాత కూడా పోలీసులు ఫిబ్రవరి 25న ఇచ్చిన ఫిర్యాదులో సూచించిన వ్యక్తులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన కుమారుడు మృతి చెంది 40 రోజులైనా సరే చర్యలు తీసుకోలేదన్నారు. ఆందుకే పాట్నాలో ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశానన్నారు.

Trending News