ఓవైపు కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లో కూర్చుకున్న క్రికెట్ ప్రేమికులు కనీసం ఐపీఎల్ 2020 అయినా జరిగింటే రెండు నెలల వినోదమని భావించారు. ఆ కోరిక ఎట్టకేలకు యూఏఈలో తీరనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)ను ఈ ఏడాది యూఏఈ వేదికగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అంగీకారాన్ని తమకు తెలిపిందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జనరల్ సెక్రటరీ ముబాషిర్ ఉస్మాని వెల్లడించారు. BCCI: సౌరవ్ గంగూలీ దాదాగిరి ముగిసిందా?
క్రికెట్ బోర్డుల నుంచి అంతా ఓకే అయింది. అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలుగా ఎంపిక చేశారు. ఇక ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించేందుకు సమ్మతిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వ మద్దతుతోనే బీసీసీఐ నడుస్తుంది కనుక త్వరలోనే ఐపీఎల్-13కు ఆమోదం లభించనుంది. సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఐపీఎల్ సంబరం నవంబర్ 8న ఫైనల్‌తో ముగియనుంది. IPL 2020: క్రికెటర్ల వెంట లవర్స్, బీసీసీఐ దారెటు?
కాగా, ఆటగాళ్లకు భద్రతా విషయాలపై బీసీసీఐ ఫోకస్ చేసింది. కరోనా కారణంగా గతంలో పరిస్థితులు లేనందున యూఏఈకి క్రికెటర్లను మాత్రమే అనుమతించాలా.. లేక వారి సతీమణులు, పిల్లలు, లేక ప్రియురాళ్లను బయో బబుల్‌లోకి తీసుకోస్తారా లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొందని ఈ వారాంతంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని బోర్డు విశ్వసనీయవర్గాల సమాచారం. పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు
IPL 2020: భారత ప్రభుత్వం ఆమోదం కోసం ఎదురుచూపులు